31, జనవరి 2025, శుక్రవారం

Rahasyam : Lalitha bhava Nilaya Song Lyrics (లలిత భావ నిలయ)

చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీత రచయిత :  మల్లాది

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి : లలిత భావ నిలయ నవ రసానంద హృదయ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే చరణం 1: శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.... శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ... చరణం 2:

నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాలిని... మనోన్మనీ
నాదబింధు కళాధరీ బ్రామరీ...
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి