Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rahasyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2025, శుక్రవారం

Rahasyam : Unnadile .. Daagundile Song Lyrics (ఉన్నదిలే... దాగున్నదిలే...)

చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీత రచయిత :  మల్లాది

నేపధ్య గానం : ఘంటసాల, పి. సుశీల



పల్లవి :
ఉన్నదిలే... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే ఉన్నదిలే... దాగున్నదిలే
నీ కన్నుల ఏదో ఉన్నదిలే...అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 1:
కన్నెపూల వన్నెలేవో... కన్ను గీటుతున్నవీ
కన్నెపూల వన్నెలేవో ... కన్ను గీటు తున్నవి
మేనిలోన ఊహలేవో... వీణ మీటుచున్నవి...
వీణ మీటుచున్నవి

ఉన్నదిలే ... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 2:
గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...ఈ...ఈ..
గుండెలోన కోరికలేవో...దండలల్లుకున్నవి...
అందరాని పోంగులేవో..తొందరించుచున్నవి
..తొందరించుచున్నవి ఉన్నదిలే... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే
చరణం 3:
ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది
ఇన్నినాళ్ళ పుణ్యమంతా ... ఎదుటనిలిచి ఉన్నది
యుగయుగాల ప్రేమగాధ... చిగురువేయుచున్నది...
చిగురువేయుచున్నది... ఉన్నదిలే... దాగున్నదిలే...
నీ కన్నుల ఏదో ఉన్నదిలే... అది నన్నే కోరుతున్నదిలే
ఈ వెన్నెలలో సై అన్నదిలే...


Rahasyam : Sri lalitha siva jyothi Song Lyrics (శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా)

చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీత రచయిత :  మల్లాది

నేపధ్య గానం : పి. లీల



పల్లవి :
శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా
శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా
శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా
చరణం 1 :
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపాడే జననీ
మనసే నీ వశమై స్మరణే జీవనమై
మనసే నీ వశమై స్మరణే జీవనమై
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళనాయకి

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా
చరణం 2 :
అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి
రవ్వల తళుకుల కళలా జ్యోతుల కప్పుర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి

శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా
శ్రీగిరి నిలయా గిరామయా సర్వమంగళా
శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామదా

Rahasyam : Amba paraku devi song lyrics (అంబా పరాకు దేవీ పరాకు)

చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీత రచయిత :  మల్లాది

నేపధ్య గానం : ఘంటసాల, పి. సుశీల, పి. లీల


పల్లవి : అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదంబా పరాకు అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదంబా పరాకు ఉమా మహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవనా గజాననా.. బహుపరాక్ బహుపరాక్... చండభుజాయమండల దోధూయమాన వైరిగణా.. షడాననా బహుపరాక్ బహుపరాక్.. మంగళాద్రి నారసింహ... బహుపరాక్ బహుపరాక్... బంగరు తల్లి కనకదుర్గ.. బహుపరాక్ బహుపరాక్.. కృష్ణాతీర కూచెన్నపూడి నిలయా గోపాలదేవ.. బహుపరాక్... అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యే అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా ఈశుని మ్రోల.. హిమగిరి బాల.. ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ.. కాకలు తీరీ కను తెరచి తను తెలసీ తన లలనను పరిణయమాడిన ప్రబంధము అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా.. చరణం 1 : రావో.. రావో.. లోల లోల లోలంబాలక రావో.... రావో రావో లోల లోల లోలం బాలక రావో లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి రాజ సులోచన రాజాననా... రావో రావో లోల లోల లోలంబాలక రావో చెలువారు మోమున లేలేత నగవులా కలహంస గమనాన కలికీ ఎక్కడికే మానస సరసినీ మణి పద్మదళముల రాణించు అల రాజహంస సన్నిధికే వావిలి పూవుల మాలలు గైసేసి వావిలి పూవుల మాలలు గైసేసి వయ్యారి నడల బాలా ఎక్కడికే వయ్యారి నడల బాలా ఎక్కడికే కన్నారా నన్నేల కైలాస నిలయాన కొలువైన అల దేవదేవు సన్నిధికే .... తగదిది తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ తగదిది తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ .. అండగా మదనుడుండగా మన విరిశరముల పదనుండగా నిను బోలిన కులపావని తానై వరు నరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ... తగదిది తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ.. కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసను కూలనేయనా కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా తగదిది తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..

చరణం 2 :

ఈశుని దాసుని చేతువా... అపసద... అపచారము కాదా ఈశుని దాసుని చేతువా.. కోలల కూలెడు అలసుడు కాడూ... ఆదిదేవుడే అతడూ... సేవలు చేసి ప్రసన్నుని చేయ.. నా స్వామి నన్నేలు నోయీ...నీ సాయమే వలదోయీ... ఈశుని దాసుని చేతువా.. కాని పనీ మదనా.. కాని పని మదనా.. అది నీ చేతకాని పని మదనా... అహంకరింతువ.. హరుని జయింతువ అహంకరింతువ.. హరుని జయింతువ అది నీ చేతకాని పని మదనా ..... కాని పని మదనా... చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా వినకపోతివా ఇంతటితో.. వినకపోతివా ఇంతటితో.. నీ విరిశరముల పని సరి.. సింగిణి పని సరి.. తేజో పని సరి.. చిగురికి నీ పని సరి మదనా కాని పని మదనా.... చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా... చిలుక తత్తడి రౌత సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా ఇవె కైమోడ్పులు ... ఇవె సరిజోతలు వినతులివే అరవిందోజ్వలా... ఇదె వకుళాంజలి మహనీయా ఇదె హృదయాంజలి... ఈశా మహేశా సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా విరులన్ నిను పూజ సేయగా... విధిగా నిన్నొక గేస్తు జేయగా దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ... కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా మరుడేపున రూపున వర్థిలుగా... రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ... ప్రభూ... పతిభిక్ష ప్రభూ.... అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో... మనమే నీ మననమై... తనువే నీ ధ్యానమై నీ భావన లీనమైన గిరిబాలనేలవో శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ... పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ.. బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం జగమేలు తండ్రికి.. జయమంగళం... విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. మంగళం.. త్రైలోక్య మందార శుభమంగళం...


Rahasyam : Lalitha bhava Nilaya Song Lyrics (లలిత భావ నిలయ)

చిత్రం : రహస్యం (1967)

సంగీతం : ఘంటసాల

గీత రచయిత :  మల్లాది

నేపధ్య గానం : ఘంటసాల



పల్లవి : లలిత భావ నిలయ నవ రసానంద హృదయ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ లలిత భావ నిలయ నవ రసానంద హృదయ విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ సుమరదన విధువదన.. దేవి సుమరదన విధువదన.. దేవి అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే అంబరాంతరంగ శారదా స్వరూపిని చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే చరణం 1: శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని బింబాధరా.. రవిబింబాంతరా.. బింబాధరా.. రవిబింబాంతరా.. రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.... శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని.. శ్రీరాజరాజేశ్వరీ... చరణం 2:

నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాలిని... మనోన్మనీ
నాదబింధు కళాధరీ బ్రామరీ...
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ