1, జనవరి 2025, బుధవారం

Rakshana : Ye Janmamadho Song Lyrics (ఏ జన్మదో.. ఈ సంబంధమూ)

చిత్రం: రక్షణ (1993)

రచన: వేటూరి

గానం: ఎం. ఎం. కీరవాణి , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

M : ఆహ...హా..హ .. F :     లల లల లల లలలా ఆహ..హా ల..లలా.. M : లా లలా లల లల ఆహ...హా..హ .. M : ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో.. ఈ సంగీతమూ F :     మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం...          ఈ ప్రేమ.. యాత్రలో.. M: ఏ జన్మదో.. ఈ సంబంధమూ

చరణం 1 :

F :      ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం..            చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం M:   పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం            మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం            అందాల గుడిలోన పూజారినో... ఓ బాట..సారినో..            ఏ జన్మదో.. ఈ సంబంధమూ..

చరణం 2 :

F :      లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ..            కలలు పండి వెలుగులాయె కలిసి ఉందామనీ M:   వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై            హేమంత సిగ్గులొలికీ.. కవ్వింతలాయె కళకే            ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోట..మాలిదో            ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో... ఈ సంగీతమూ F :      మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే తాంబూలం...             ఈ ప్రేమ యాత్రలో M:    ఏ జన్మదో... ఈ సంబంధమూ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి