Rakshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rakshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జనవరి 2025, బుధవారం

Rakshana : Ye Janmamadho Song Lyrics (ఏ జన్మదో.. ఈ సంబంధమూ)

చిత్రం: రక్షణ (1993)

రచన: వేటూరి

గానం: ఎం. ఎం. కీరవాణి , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి :

M : ఆహ...హా..హ .. F :     లల లల లల లలలా ఆహ..హా ల..లలా.. M : లా లలా లల లల ఆహ...హా..హ .. M : ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో.. ఈ సంగీతమూ F :     మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం...          ఈ ప్రేమ.. యాత్రలో.. M: ఏ జన్మదో.. ఈ సంబంధమూ

చరణం 1 :

F :      ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం..            చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం M:   పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం            మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం            అందాల గుడిలోన పూజారినో... ఓ బాట..సారినో..            ఏ జన్మదో.. ఈ సంబంధమూ..

చరణం 2 :

F :      లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ..            కలలు పండి వెలుగులాయె కలిసి ఉందామనీ M:   వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై            హేమంత సిగ్గులొలికీ.. కవ్వింతలాయె కళకే            ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోట..మాలిదో            ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో... ఈ సంగీతమూ F :      మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే తాంబూలం...             ఈ ప్రేమ యాత్రలో M:    ఏ జన్మదో... ఈ సంబంధమూ


Rakshana : Ghallumandhi glass song Lyrics (ఘల్లు మంది బాసు గలాసు)

చిత్రం: రక్షణ (1993)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు పాతికేల్ల ఫోర్సు ఫినిషు బ్యాచిలర్ బూజు మటాషు ఓ యస్సు ఇచ్చెయ్ మంది మిస్సు ఒ కిస్సు ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు పాతికేల్ల ఫోర్సు ఫినిషు బ్యాచిలర్ బూజు మటాషు ఓ యస్సు ఇచ్చెయ్ మంది మిస్సు ఒ కిస్సు ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు మహ ఘాటుగ మోటుగ నాటుగ లేదూ new taste-u హో మహ ఘాటుగ మోటుగ నాటుగ లేదూ new taste-u యమ కొత్తగ చిత్తుగ మత్తుగా యేదొ చేసేస్తు తడిపేసెయ్ లిప్ప్సు దులిపేసెయ్ తుప్ప్సు దడపెంచేయ్ జడిపించెయ్ నడి జాము రాత్రులూ విజిల్స్ గజల్సు స్రుతి లయా తెగించే భజన కానీ వయస్సు మనస్సు మతిచెడె విదంగా అదిరిపోనీ గలాట గోల చెయ్ ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు పాతికేల్ల ఫోర్సు ఫినిషు ఘల్లు మంది బాసు మును ముందర చిందర వందర చేసె dry days-u హ హ హ మును ముందర చిందర వందర చేసె dry days-u తిరకాసులు కేసులు రేసులు రాసే డైరీసు ప్రతి పూట fighting ప్రతి చోట shooting ప్రతి బాట ప్రతి మాట పోలీసు syllabus-u సవాల్సు శెవాల్సు కనపడె tomorrow మనది బాసూ colors కబుర్సు అనబడె కులాస లేని course-u చలాకీ చిందులెయ్ దినకు దిన ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు పాతికేల్ల ఫోర్సు ఫినిషు బ్యాచిలర్ బూజు మటాషు ఓ యస్సు ఇచ్చెయ్ మంది మిస్సు ఒ కిస్సు ఘల్లు మంది బాసు గలాసు త్రిల్లు గుంది డోసు పటాసు పాతికేల్ల ఫోర్సు ఫినిషు బ్యాచిలర్ బూజు.......

Rakshana : Neeku Naaku link unna Song lyrics (నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను)

చిత్రం: రక్షణ (1993)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: మాల్గుడి శుభ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

హా... హా... హా.. హ.

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను

ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా

గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ

పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా

సంజైతలే నీ సంగతేంటో

ఈ సందులో నీవుందువో మల్ల తెల్వలే

హా... హా... హా.. హ.

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను

ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా

గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ

పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా


చరణం 1:

బెకారుగానే ఫిర్కాలన్ని

ఎక్కెక్కి చూస్త ఉన్నా

రస్టు తీరెనా ఎంత ఇస్కి పోయినా

ఏ పోరగనికో ఈ సరుకంతా ఉరకే ఇస్తనన్నా

ఇష్టమాయెనా ఇట్టె తీస్కపాయెనా

ఏమాయే నా పుంజు ఎటు పాయే

జోడాయే కోడె గాడు రాడాయే

ఎండ్లాల్లిలా ఈ కన్నె సర్లే

అందాలిలా ఉండాలి ఏండాలె తెల్వలే

హా...హా... హా... హా.

నీకు నాకు ఉన్న లింకు ఈడనో సెప్పలేను

ఆడనో సెప్పలేను ఏడనో సెప్పలేను రా

గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ

పోకిరీ పోరగాడ జల్ది నా జంట కూడరా

హా...హాహా... హా...హాహా.


చరణం 2:

ఆ పోరి ఎంకే జారే వంకో ఎనకెనక రాలేనా

ఊరుకుందునా పత్తా పట్టుకుందునా

చెజారగానే బేజారయ్యె మామూలు లడకీనా

చేరకుందునా సత్తా చుపకుందునా

దునియాలో గల్లి గల్లి గాలిస్తా

ఎనకాలే లొల్లిలొల్లి చేసెస్తా

సిర్రెక్కదా సింగారమంతా

సీకట్లకే సోకిచ్చుకోవాలా తెల్వలే

హా..హా..హా...హా.


నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను

ఆడనో చెప్పలేను ఏడనో చెప్పలేను రా

గౌలిగూడ గల్లి కాడ చల్లగా గిల్లినోడ