29, జనవరి 2025, బుధవారం

Raktha Sindhuram : O Chinnadana Song Lyrics (ఓ చిన్నదానా )

చిత్రం: రక్తసింధూరం (1985)

రచన:  వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి :

ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 
నా కంటిపాపా నీ జంటతోనే ఓ ఇంటివాణ్ణి చేసేయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా
ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
నా అందమంతా నీ హారతేలే లాలించరా

చరణం 1 :

జలకాలాడించనా.. జడలే అల్లించనా
జాజీపూలెట్టి పూజించనా
కసిగా కవ్వించనా... రుచిగా నవ్వించనా
నడుమే అందించి లాలించనా
ఇల్లే కట్టేస్తే.. కౌగిళ్లిచ్చేస్తా
ముగ్గే పెట్టెస్తే ముగిళ్లిచేస్తా
సామిరంగ సందెముద్దు పెట్టనీదాయే
నింగిలోని రంగు పొద్దు జారనీడాయే

ఓ చిన్నదానా నా ఒంటిబాధ కన్నావా..  ఓ భామా
నా ఇంటి దొంగ నీ ఇంటి బెంగ కన్నాలే ఈ వేళ


చరణం 2  :

మనసై జపించనా... వయసై తపించనా
మల్లేదీపాలు వెలిగించనా
సొగసై వరించనా.. సగమై తరించనా
మసకా మంత్రాలు వల్లించనా
ముసిరే సిగ్గుల్తో ముద్దే ఇచ్చేస్తా
ఇచ్చే ముద్దుల్తో నచ్చేదిమ్మంటా
అబ్బరంగా ఒక్కటిచ్చి పండుకోడాయే
నిబ్బరంగా నిప్పు ఈడు ఉండనీదాయే

ఓ చిన్నవాడా  చిలకమ్మ తోడ విన్నాలే నీ గోలా
ఈ సందెవేళ నా జాలి గాధ విన్నావా.. రా భామా 
ఈ చంటివాణ్ణి ఓ ఇంటివాణ్ణి చేస్తాను గానీ మానెయ్యవా
ఏకాంత వేళ   ఈ కాంత సేవా వరమియ్యవా  
ఉమ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉహు..హు..ఉహు..
అహాహా... ఓ..హో..హో...




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి