చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం : కె.వి. మహదేవన్
పల్లవి: చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చరణం 1: చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు సిగపాయల పువ్వులే సిగ్గుపడేను సిగపాయల పువ్వులే సిగ్గుపడేను చిగురాకుల గాలులే ఒదిగొదిగేను ఇక్కడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని.. చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని.. చరణం 2: మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మిసిమి పెదవి మధువులు తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ముసిరేనని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి