Undamma Bottu Pedata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Undamma Bottu Pedata లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జనవరి 2025, శనివారం

Undamma Bottu Pedata : Adugaduguna Gudi Undhi Song Lyrics (అడుగడుగున గుడి ఉంది..)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది చరణం 1: ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది చరణం 2: తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం.. అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది..

Undamma Bottu Pedata : Yendhukee Sandhegaali Song Lyrics (ఎందుకీ సందెగాలి.. )

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి తొందర తొందరలాయె.. విందులు విందులు చేసే ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి చరణం 1: ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము పరుగు పరుగునా త్వర త్వరగా ప్రభుని పాదముల వాలగ విందులు విందులు చేసే.. ఎందుకీ సందెగాలి సందెగాలి తేలి మురళి చరణం 2: ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ ఏమాయెనో గాని ఆ పిల్లన గ్రోవిని విని.. విని.. విని.. ఏదీ ఆ... యమున యమున హృదయమున గీతిక ఏదీ బృందావన మిక.. ఏదీ విరహ గోపిక ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి తొందర తొందరలాయె.. విందులు విందులు చేసే ఎందుకీ సందెగాలి.. సందెగాలి తేలి మురళి

Undamma Bottu Pedata : Chalule Nidhurapo Song Lyrics (చాలులే నిదరపో...)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: చాలులే నిదరపో... జాబిలి కూనా ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా చాలులే నిదరపో జాబిలి కూనా... ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా చరణం 1: అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి... వేలెడేసి లేవు బోసి నవ్వులదానా మూసే నీ కనుల.. ఎటుల పూసేనే నిదర... అదర... జాబిలి కూనా... ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా చరణం 2: అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టిలోకి రానీ ఔరా కోరికలు.. కలలు... తీరా నిజమైతే.. ఐతే... జాబిలి కూనా... ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా తుమ్మెదలాడేనా... తూనీగలాడేనా ఉహ్మ్... ఉహ్మ్... ఉహ్మ్... ఉహ్మ్...


Undamma Bottu Pedata : Chukkalatho Cheppalani Song Lyrics (చుక్కలతో చెప్పాలని.. ఏమని)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి: చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చరణం 1: చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు చెదిరే ముంగురులు కాటుకలు నుదురంతా పాకేటి కుంకుమలు సిగపాయల పువ్వులే సిగ్గుపడేను సిగపాయల పువ్వులే సిగ్గుపడేను చిగురాకుల గాలులే ఒదిగొదిగేను ఇక్కడ ఏకాంతంలొ ఏమో ఏమేమో అని.. చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని.. చరణం 2: మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మనసులో ఊహకనులు కనిపెట్టే వేళ చెవిలో ఒక చిన్న కోర్కె చెప్పేసే వేళ మిసిమి పెదవి మధువులు తొణికేనని మిసిమి పెదవి మధువులు తొణికేనని పసికట్టే తుమ్మెదలు ముసిరేనని ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని చుక్కలతో చెప్పాలని.. ఏమని ఇటు చూస్తే తప్పని.. ఎందుకని.. ఇక్కడ ఏకాంతంలో ఏమో ఏమేమో అని..

Undamma Bottu Pedata : Ravamma Mahalakshmi Ravamma Song Lyrics (రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా )

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్



పల్లవి:
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా... రావమ్మా
చరణం 1:
గురివింద పొదకింద గొరవంక పలికె... గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె ...
గురివింద పొదకింద గొరవంక పలికె... గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె తెల్లారి పోయింది పల్లె లేచింది...
తెల్లారి పోయింది పల్లె లేచింది... పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా
చరణం 2:
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి...గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి... గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో ...ముగ్గుల్లో... గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ... రావమ్మా... రావమ్మా... కృష్ణార్పణం
చరణం 3:
పాడిచ్చే గోవులకు పసుపుకుంకం...పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం... పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం ...
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం ...కలకాలం సౌఖ్యం .. రావమ్మా మహాలక్ష్మీ ...రావమ్మా నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని...
కొలువై ఉందువుగాని...కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ...రావమ్మా ...రావమ్మా...కృష్ణార్పణం

Undamma Bottu Pedata : Pathala Gangamma Rarara Song Lyrics (పాతాళ గంగమ్మా రారారా... )

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్


పల్లవి :

గంగమ్మా రా... గంగమ్మా రా... గంగమ్మా రా
పాతాళ గంగమ్మా రారారా... ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ... పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ పాతాళ గంగమ్మా రారారా.... ఉరికురికీ ఉబికుబికీ రారారా
పగబట్టే పామల్లే పైకీ పాకీ.... పరుగెత్తే జింకల్లే దూకీ దూకీ
పాతాళ గంగమ్మా రారారా... చరణం 1 : వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా
వగరుస్తూ గుండే దాక పగిలింది నేలా
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా సోలిన ఈ చేనికీ.... సొమ్మసిల్లిన భూమికీ
సోలిన ఈ చేనికీ.... సొమ్మసిల్లిన భూమికీ
గోదారి గంగమ్మా సేద తీర్చావమ్మా పాతాళ గంగమ్మ రా రా రా... ఉరుకురికీ ఉరుకురికీ రారారా
పాతాళ గంగమ్మ రా రా రా చరణం 2 : శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో
శివమూర్తీ జఠనుండి చెదరీ వచ్చావో
శ్రీదేవి దయలాగ సిరులే తెచ్చావో అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
అడుగడుగున బంగారం... ఆకుపచ్చని శింగారం
తొడగవమ్మ ఈ నేలకు సస్యశ్యామల వేసం పాతాళ గంగమ్మ రారారా..

Undamma Bottu Pedata : Srisailam Mallanna Sirasonchena Song Lyrics (శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా)

చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)

గీత రచయిత : దేవులపల్లి కృష్ణ శాస్త్రి

నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం : కె.వి. మహదేవన్


పల్లవి : శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా..
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంత గంగమ్మ వానా.. తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా
తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఎండా వెన్నెలలైనా ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. చరణం 1 : కదిలొచ్చీ కలిసొచ్చీ తలుపులు తీసేరో... కలవారి కోడళ్ళు..
నడుమొంచి చెమటోర్చి... నాగళ్ళు పట్టేరు
నా జూకు దొరగారు... నాజూకు దొరగారు
అంటకుండా నలిగేనా ధాన్యాలు... వంచకుండా వంగేనా ఆ వొళ్ళూ ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. చరణం 2 : ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ... అన్నదమ్ములం
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము... అక్కాచెల్లెళ్ళం
ఏటికైన ఏతాము ఎత్తేవాళ్ళం మేమూ... అన్నదమ్ములం
మేమూ అన్నదమ్ములం....
ఏడేడు గరిసెల్లు నూర్చే వాళ్ళం మేము... అక్కాచెల్లెళ్ళం
మేము అక్కాచెల్లెళ్ళం.... గాజుల చేతుల్లో రాజనాలపంట
గాజుల చేతుల్లో రాజనాలపంట
కండరాలు కరిగిస్తే కరువే రాదంటా.. ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా.. తిరుమలపై వెంకన్న కనువిప్పేనా... కరుణించు ఏండా వెన్నెలలైనా ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ...
ఓ..ఒహొహొహొ..ఓ..ఓహొహొహొ
శ్రీశైలం మల్లన్న శిరసొంచేనా... చేనంతా గంగమ్మ వానా..