10, జనవరి 2025, శుక్రవారం

Vayasu Pilichindi : Jeevitham Madhusala Song Lyrics (జీవితం మధుశాల)

చిత్రం: వయసు పిలిచింది(1978 )

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: రామకృష్ణ, ఎస్.జానకి

సంగీతం: ఇళయ రాజా


పల్లవి :

ఆ.. ఆ... ఆ.. ఆ... ఆఆ..
జీవితం మధుశాల యవ్వనం రసలీల
జీవితం మధుశాల యవ్వనం రసలీల
రేపటి మాటలే.. నవ్వుకో ఈవేళ..
జీవితం మధుశాల యవ్వనం రసలీల

చరణం 1:

ఓ..ఓ..ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ
పెదవే మధుకలశం.. అందుకో ప్రేమ రసం
పెదవే మధుకలశం.. అందుకో ప్రేమ రసం
అందమే నీకు వశం.. చిందుకో వుల్లాసం
వచ్చిందీ మధుమాసం.. నేడే నీకోసం...
జీవితం నీకు వరం.. చేరుకో సుఖతీరం
నాబిగి కౌగిలిలో.. రాసుకో శృంగారం..
జీవితం నీకు వరం.. చేరుకో సుఖతీరం

చరణం 2 :

ఆ..ఆ...ఆ..ఆ.ఆ..
చక్కని పక్కవుంది.. పక్కపై చుక్కే ఉందీ
చక్కని పక్కవుంది.. పక్కపై చుక్కే ఉందీ
చుక్క కూడ పక్కనే వుందీ... పక్క కూడ పక్కుమందీ..
మక్కువైతే దక్కేనందీ... దక్కితే చిక్కేముందీ..
జీవితం మధుశాల యవ్వనం రసలీల

చరణం 3 :

ఆ..ఆ..ఆ..ఆ...ఆ
ఆ ఆఅ ఆఅ ఆ
కన్నులే కలుసుకుంటే.. వెన్నెలే వేడి కదా..
కన్నులే కలుసుకుంటే.. వెన్నెలే వేడి కదా..
కన్నెతో కలసివుంటే.. స్వర్గమే చేదు కదా..
ఇద్దరం ఒక్కటైతే.. మనసుదే కావ్యసుధా..
జీవితం మధుశాల యవ్వనం రసలీల
రేపటి మాటలే.. నవ్వుకో ఈవేళా..
జీవితం మధుశాల యవ్వనం రసలీల
ఓ..ఓ..ఓ..
యవ్వనం రసలీల..
ఓ..ఓ..ఓ..
యవ్వనం రసలీల..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి