చిత్రం: వయసు పిలిచింది(1978 )
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
సంగీతం: ఇళయ రాజా
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే...
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే..
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..
వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...
చరణం 1 :
వయసులో వేడుంది... మనసులో మమతుంది
వయసులో వేడుంది... మనసులో మమతుంది
మమతలేవో సుధామయం..మాటలేమో మనోహరం..
మదిలో మెదిలే మైకమేమో...
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..
వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...
చరణం 2 :
కంటిలో కదిలేవు... జంటగా కలిశావు
కంటిలో కదిలేవు... జంటగా కలిశావు..
నీవు నేను సగం సగం...కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసు తనివి రేపునే...
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..
వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...
చరణం 3 :
రరరర లలలల రరరర లలలల
భావమే నేనైతే... పల్లవే నీవైతే..
భావమే నేనైతే... పల్లవే నీవైతే...
ఎదలోన ఒకే స్వరం... కలలేమో నిజం నిజం..
పగలు రేయి ఏదో హాయి...
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..
వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...
ఊయలూగునే... హాహ... హాహహా...