ఆల్బమ్ : వెళ్ళకే (2023)
సంగీతం: భరత్- సౌరభ్ (వయోలిన్ నేపద్యము అనిరుధ్ రవిచందర్ 3 చిత్రం)
సాహిత్యం: సురేష్ బనిసెట్టి
గానం: యాజిన్ నిజార్
పల్లవి :
అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నలాగా వదులుకుంటాను
నీ ఊసు లేని ఏ ఊసు వద్దు
నీ శ్వాస నాలో దాచానులే
వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళే కన్నులలో నీరులా
జారకే వెళ్ళే... వెళ్ళకే వెళ్ళకే
చరణం : 1
అరె ఇక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తుంటే మనమే నీతోడు నేననీ నా నీడ నువ్వని మన మధ్య ప్రేమని ఎలా మరువనే నీ చెంత ఏదనీ నీ వెంట లేడని గతమంతా అడిగితే నేనేం చెప్పనే నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా ఓ జ్ఞాపకంలా మారిపోకలా వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళే కన్నులలో నీరులా జారకే వెళ్ళే... వెళ్ళకే వెళ్ళకే
చరణం : 2 అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నలాగా వదులుకుంటాను నీ ఊసు లేని ఏ ఊసు వద్దు నీ శ్వాస నాలో దాచానులే వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి