చిత్రం: అన్నమయ్య(1997)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
రచన: అన్నమయ్య కీర్తన
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పల్లవి :
ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేళీ విహార లక్ష్మీనారసింహా ... లక్ష్మీనారసింహా
చరణం 1 :
ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార
లలితనిశ్వాసడోలారచనయా
కులశైలకుంభినీ కుముదహిత రవిగగన
చలన విధినిపుణ నిశ్చల నారసింహా... నిశ్చల నారసింహా
చరణం 2 :
దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి
కారస్ఫులింగసంగక్రీడయా
వైరిదానవఘోర వంశభస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహ... వేంకట నారసింహ
వేంకట నారసింహ... వేంకట నారసింహ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి