1, ఫిబ్రవరి 2025, శనివారం

Aalu Magalu : Telusuko Ee Jeevitha Satyam Song Lyrics (తెలుసుకో ఈ జీవిత సత్యం.. )

చిత్రం: ఆలుమగలు (1977)

సంగీతం: తాతినేని చలపతిరావు

గీతరచయిత: శ్రీ శ్రీ

నేపధ్య గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



సాకి :
ఈ జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులు
అంతులేని సుఖదుఃఖాలలో అందరూ సహాధ్యాయులే పల్లవి:
తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం
ఏ వయసునకా చోటుంది.. అక్కడే నీకు పరువుంది
అప్పుడే నీకు సుఖముంది ..
తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం చరణం 1 :
కడుపులో శిశువు కదిలి కుదిపితే.. అదియే తల్లికి ఆనందం
అక్కున చేర్చిన కొడుకు తన్నితే.. అదియే తండ్రికాహ్లాదం
ఎదిగిన సుతులే మమతలు మరచి ఎదురు తిరిగితే
నువ్వెక్కడ?.. నీ పరువెక్కడ?.. నీ చోటెక్కడ? తెలుసుకో ఈ జీవిత సత్యం.. జరిగేదే ఇది ప్రతినిత్యం చరణం 2 : తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం
తొలిరోజులలో ఆలుమగలది ఉరకలు తీసే ఉబలాటం
బాధ్యత ముగిసి మళ్ళిన వయసుల ముడివేసేదే అనురాగం ఆ ఉబలాటం ఆ అనురాగం కరువైపోతే
నువ్వెక్కడ? .. నీ పరువెక్కడ?.. నీ తోడెక్కడ?.. నీ నీడెక్కడ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి