1, ఫిబ్రవరి 2025, శనివారం

Allari Pillalu : Bombai rasagulla Song Lyrics (బొంబాయ్ రసగుల్లా )

చిత్రం: అల్లరి పిల్లలు (1978)

సంగీతం: సత్యం

రచన: కొసరాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

లలలలా.. లలలలా..
ఓ రాజులు... హోయ్ ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే...   
నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు 
ఓ బుల్ బులు... అహా జిల్ జిలు
నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే 

చరణం 1 :

అహా.. మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో.. హెహెహీ
మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో
కొత్తదాన్ని వలచి పాతదాన్ని మరచి...
మసిబూసిపోతారయ్యో.... 

ఓ రాజులు... హోయ్ ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే... 
నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు 

చరణం 2 :

అబ్బెబ్బే అలా కాదు...  అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
అబ్బెబ్బే అలా కాదు...  అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
ఉన్నదంతా ఇస్తా.. నా ప్రాణం ఒగ్గేస్తా ...
నీ ఒళ్ళో వాలేస్తా....

ఓ బుల్ బులు... అహా జిల్ జిలు
నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే
ఉందే... ఉందే... ఉందే
చరణం 3 :
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా... విన్నా
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా... 
నువ్వు యెస్  అంటే... నేను 'సై ' అంటే
అడ్దమే ఉందే లైలా
ఓ రాజులు... హోయ్... ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి