Allari Pillalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Allari Pillalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఫిబ్రవరి 2025, ఆదివారం

Allari Pillalu : Srichakra Subhanivasa Song Lyrics (శ్రీచక్ర శుభనివాసా...)

చిత్రం: అల్లరి పిల్లలు (1978)

సంగీతం: సత్యం

రచన: సి.ఎస్.రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల




పల్లవి:

శ్రీచక్ర శుభనివాసా...
స్వామి జగమేలు చిద్విలాసా
నా స్వామి  శృంగార శ్రీనివాసా..
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా స్వామి శృంగార శ్రీనివాసా

చరణం 1:

ఆత్మను నేనంటివి... 
దేవ పరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటివి... 
దేవ పరమాత్మ నీవేనంటివి

నీలోన నిలిచిపోనా.. 
నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాసా...

శ్రీచక్ర శుభనివాసా ...
స్వామి జగమేలు చిద్విలాసా
నా స్వామి శృంగార శ్రీనివాసా..

చరణం 2:

కలవాడిననీ.. హరి ఓం...
సిరి కలవాడిననీ.. హరి ఓం...
మగసిరి కలవాడిననీ.. హరి ఓం...

మనసు పద్మావతికిచ్చి.. 
మనువు మహలక్ష్మికిచ్చినా...
స్వామీ శృంగార శ్రీనివాసా...

శ్రీచక్ర శుభనివాసా...
స్వామి జగమేలు చిద్విలాసా...
నా స్వామి శృంగార శ్రీనివాసా...
నా  స్వామి శృంగార శ్రీనివాసా...
నా  స్వామి శృంగార శ్రీనివాసా...
నా  స్వామి శృంగార శ్రీనివాసా...
నా  స్వామి శృంగార శ్రీనివాసా...


Allari Pillalu : Naa Rasi Kanya Rasi Song Lyrics (నా రాశి.. కన్య రాశి..)

చిత్రం: అల్లరి పిల్లలు (1978)

సంగీతం: సత్యం

రచన: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

నా రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...

చరణం 1 :

రాముడు వెలసిన శుభలగ్నములో.. నేను నీకై వెలిశాను
జానకి వెలసిన శుభఘడియలలో.. నేను నీకై వెలిశాను  
అయితే మనలో అనురాగం.. కథగా నిలుచును కలకాలం
మనకిక తప్పదు సహవాసం.. నీతో రానా వనవాసం... 
నీ రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...

చరణం 2 :

ఎవరూ చూడని ఏకాంతములో ఎదలు ఒకటైపోవాలి..
నాలుక పలికే మాటల వెనుక నీ కథలన్నీ తెలియాలి..
ఎవరూ చూడని ఏకాంతములో ఎదలు ఒకటైపోవాలి..
నాలుక పలికే మాటల వెనుక నీ కథలన్నీ తెలియాలి..
సాగించాలి సంసారం.. లేదా రేపే సన్యాసం..
వద్దు ఎందుకు సన్యాసం.. బుద్ధిగ చేద్దాం సంసారం..   

నీ రాశి.. కన్య రాశి.. నీ రాశి.. మిథున రాశి
కలిసేను  జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...
అహహాహ.. ఆహహహా.. 

Allari Pillalu : Pethanamantha naade song lyrics (పెత్తనమంతా నాదే)

చిత్రం: అల్లరి పిల్లలు (1978)

సంగీతం: సత్యం

రచన: కొసరాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా... 
పెత్తనమంతా నాదే
ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా...
అధికారమంతా నాదే
ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా... 
పెత్తనమంతా నాదే
ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా...
అధికారమంతా నాదే

చరణం 1 :

అప్పుడు రాముడు విల్లు విరిచెను జానకి కోసం
ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... హక్కుల కోసం
అప్పుడు రాముడు విల్లు విరిచెను జానకి కోసం
ఇప్పుడు అన్నీ నే విరిచేస్తా... హక్కుల కోసం

ఓ.. ఓ.. మహిషాసురిని మర్ధించే కాళి లోకం కోసం
మహిషాసురిని మర్ధించే కాళి లోకం కోసం
ఇక్కడ చిక్కినవన్నీ ముక్కలు చేస్తా  ప్రతిష్ట కోసం

హ..హా.. ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా... 
పెత్తనమంతా నాదే
ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా...
అధికారమంతా నాదే

చరణం 2 :

ద్రౌపది శపధం దుశ్శాసనుని డొక్క చీల్చినది నాడు
ద్రౌపది శపధం దుశ్శాసనుని డొక్క చీల్చినది నాడు
ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా పచ్చడి చేస్తా నేడు
ఇక్కడ కొంటెతనం ఎవరు చేసినా పచ్చడి చేస్తా నేడు

ఝం ఝం ఝమాగా ఏమైన చేస్తా...
అధికారమంతా నాదే
ధుం ధుం ధుమాగా ఏదైన చేస్తా... 
పెత్తనమంతా నాదే

చరణం 3 :

తెలవాడి పనిపట్టెను  గాంధి....  జన్మహక్కు కోసం
విలన్ను తన్నెను ధర్మం కోసం ఎన్. టి. రామారావు
తెలవాడి పనిపట్టెను  గాంధి....  జన్మహక్కు కోసం
విలన్ను తన్నెను ధర్మం కోసం ఎన్. టి. రామారావు
చూస్కో దెబ్బా... పోవోయ్ డబ్బా
మోసం సాగదు... ద్వేషం సాగదు
పోవే పో.. పోవే పో....
పో...పో...
పో...పో... 

1, ఫిబ్రవరి 2025, శనివారం

Allari Pillalu : Bombai rasagulla Song Lyrics (బొంబాయ్ రసగుల్లా )

చిత్రం: అల్లరి పిల్లలు (1978)

సంగీతం: సత్యం

రచన: కొసరాజు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



పల్లవి :

లలలలా.. లలలలా..
ఓ రాజులు... హోయ్ ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే...   
నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు 
ఓ బుల్ బులు... అహా జిల్ జిలు
నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే 

చరణం 1 :

అహా.. మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో.. హెహెహీ
మగవాళ్ళ వలపు మబ్బుల్లో మెరుపు...
అది నాకు తెలుసు పోవయ్యో
కొత్తదాన్ని వలచి పాతదాన్ని మరచి...
మసిబూసిపోతారయ్యో.... 

ఓ రాజులు... హోయ్ ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
నువ్వు సూటుతోటి వస్తే... 
నీ సోకులన్నీ చూస్తే దొరబాబల్లే ఉన్నావు 

చరణం 2 :

అబ్బెబ్బే అలా కాదు...  అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
అబ్బెబ్బే అలా కాదు...  అలాంటి వాణ్ణి కాదు
అబద్ధాల కోరును కాదూ.... ఊ...
ఉన్నదంతా ఇస్తా.. నా ప్రాణం ఒగ్గేస్తా ...
నీ ఒళ్ళో వాలేస్తా....

ఓ బుల్ బులు... అహా జిల్ జిలు
నిన్నొదిలిపెట్టి ఉండలేనే
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే
ఉందే... ఉందే... ఉందే
చరణం 3 :
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా... విన్నా
వేళ గాని వేళా.. ఏమిటీ గోలా
విన్నావా పోలీసు ఈలా... 
నువ్వు యెస్  అంటే... నేను 'సై ' అంటే
అడ్దమే ఉందే లైలా
ఓ రాజులు... హోయ్... ఫోజులు..
ఈ వెర్రి మొర్రి వేషమెందుకు
రంజురంజు పిల్లా...
బొంబాయ్  రసగుల్లా మనసంతా నీమీదే ఉందే