19, ఫిబ్రవరి 2025, బుధవారం

Anukokunda Oka Roju : Needalle Tharumuthuvundi Song Lyrics (నీడల్లే తరుముతూ ఉంది…)

చిత్రం : అనుకోకుండా ఒక రోజు (2005)

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

సాహిత్యం: ఎం.ఎం. కీరవాణి, గంగ రాజు

గానం: శ్రేయ ఘోషల్




పల్లవి:

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగా పైబడుతుంది… ఉరుమేదో ఉండుందీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…
నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ……

చరణం : 1

నిప్పు పై… నడకలో… తోడుగా… నువ్వుండగా…
ఒక బంధమే… బూడీదై… మంటలై మది నిండగా
నీ బాధ ఏ కొన్చమొ… నా చెలిమితో తీర దా….
పీల్చే గాలినైనా… నడిచే నెలనైనా…
నమ్మాలో… నమ్మరాడో… తెలియని ఈ పయనంలో

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…

చరణం : 2

ఎందుకో… ఎప్పుడో… ఏమిటో… ఎక్కడో…
బదులు లేని ప్రశ్నలే… నీ ఉనికినే ఉరి తీయగా…
భయమన్నదే పుట్ట దా…
ప్రతి ఊహాతో పెరగదా…
పీల్చే గాలినైనా… నడిచే నెలనైనా…
నమ్మాలో… నమ్మరాదొ… తెలియని ఈ పయనంలో

నీడల్లే తరుముతూ ఉంది… గతమేదో వెంటాడీ…
మౌనంగా పైబడుతుంది… ఉరుమేదో ఉండుందీ…
శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై
దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి