5, ఫిబ్రవరి 2025, బుధవారం

Anumanaspadam : Mallello Illesi Song Lyrics (మల్లెల్లో ఇల్లేసే చందమామా..)

చిత్రం: అనుమానాస్పదం(2007)

సాహిత్యం: వేటూరి

గానం: సాధన సర్గం, హరిహరన్

సంగీతం: ఇళయరాజా


పల్లవి:

మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా
ప్రేమకధలెన్నో విన్నావో..ప్రేమ జతలెన్నో చూసావో
మా మనవి మన్నించి..దీవించి..వెళ్ళలేవా !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

చరణం 1:

కొండమల్లి పూలు చల్లి వెళ్ళకూ..గుండె గిల్లి వేదన పెంచి వెళ్ళకూ
హెచ్చు తగ్గు కాంతుల వేడి పెంచకూ..ఇచ్చి పుచ్చుకున్న వేళ ఈల వెయ్యకూ
నీ మౌనరాగాల ఆలాపనంతా ఈ చాటు మాటేనా అన్వేషణా
రోజూ నీ ప్రేమ నాటకం .. ఈ రోజు ఆడావు బూటకం
ఆడించి పాడించు నా గానలోలా.. వేచాను ఇన్నాళ్ళు వేసవల్లే !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

చరణం 2:

నల్లమబ్బు చాటున నవ్వులెందుకో..తెల్ల చీర అంచున దూకుడెందుకో
అచ్చమైన ఆశకు అల్లరెందుకో..మచ్చ పడ్డ ఈడున గిల్లుడెందుకో
నీ వెన్నలే కాసే నయనాల మీదా..నీ కన్నులే చూసే ఆవేదనా
వాల్మీకి చూసే ఈ కళ్ళలోనా..సీతమ్మ చూపులు సిరివెన్నెలేనా
శాసించి పాలించు ఈ రేయిలోనా..దీపాలు పూయాలి హాయిగానే !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
ప్రేమకధలెన్నో విన్నావో..ప్రేమ జతలెన్నో చూసావో
మా మనవి మన్నించి..దీవించి..వెళ్ళలేవా !
మల్లెల్లో ఇల్లేసే చందమామా..చందమామా..చందమామా
వెన్నెల్లూ చల్లేసే చందమామా..చందమామా..చందమామా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి