18, ఫిబ్రవరి 2025, మంగళవారం

Ashok : Oka Chinni Navve Navvi Song Lyrics (ఒక చిన్ని నవ్వే నవ్వి)

చిత్రం : అశోక్(2006)

సంగీతం: మణి శర్మ

సాహిత్యం: చంద్రబోస్

గానం: కే కే



పల్లవి :

ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చూ
చిరునవ్వుల దీపం వెలిగించూ
నీ బాధలకీగతి తొలగించూ
చిరునవ్వుల బాణం సంధించూ
శత్రువులే ఉండరు గమనించూ
మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చూ
మనసున్నోడే తనవారిని కూడా నవ్వించూ
పైనున్నోడే నీ నవ్వును చూసి దిగి వచ్చూ
నీతో పాటే తన కష్టం మరవచ్చూ

ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చూ

చరణం : 1

నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా
పెదవుల్లో నవ్వే వాటికి మందూ
నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా
ఆదరాల నవ్వే వాటికి హద్దూ
త్వరగా నిను చూసి నవ్వేవారు నిద్దుర పోయేట్టూ
సరిగా నీ నవ్వుని నిచ్చెన చేసి ఎక్కర పై మెట్టూ
నీ కోపం నువ్వే కరిగించు
నీ రూపం నువ్వే వెలిగించూ
ఈ పాఠం నువ్వే పాటించు
పది మందికి నువ్వే చాటించూ

ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చూ

చరణం : 2

ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించీ కసీతీరా ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాళ్లుంటే కడుపారా ఏడుస్తుందీ కాలం
కనుకే లోకాన్ని ఎదిరించేటి మార్గం కనిపెట్టు
కదిలే కాలానికి ఎదురీదేటి ధైర్యం చూపేట్టూ
ఈ జీవిత సత్యం గుర్తించూ
ఆఆనందం నీవై జీవించూ
నీ చలనం నీవే గమనించూ
సంచలనం నువ్వే సృస్టించూ ...

ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ
ఒక చిన్న నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చూ
ఒక చిన్ని నవ్వే నవ్వి యుధ్దాలెన్నో ఆపొచ్చూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి