17, ఫిబ్రవరి 2025, సోమవారం

Chirutha : Yamaho Yamma Song Lyrics (యమహో యమ్మ ఏం ఫిగరు)

చిత్రం: చిరుత (2007)

రచన:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: టిప్పు

సంగీతం: మణి శర్మ

పల్లవి:

యమహో యమ్మ ఏం ఫిగరు తిమ్మురెంతుందిరో చూడు గురు
దమ్ములుంటే కమ్ముకొచ్చి దుమ్ములేపమందిరో
ఓసోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుందే
వగలన్ని పోగేసి చెలరేగే నిను చూసి గల్లంతై మతి చెడిపోతుందే
మజునునై జుట్టంతా పీక్కుందునా గజినినై గుట్టంతా లాక్కొందునా
చంపేశావే నన్నియాలే ఒయ్ ఒయ్ ఒయ్
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

చరణం:1

కాలేజి ఈడంటూ ఎల్కెజి డ్రస్సేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి
తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపే ఎక్కిపోరా పాపం తల తూగి
తప్పేదో జరిగేట్టుందే నీ ధాటికి ఉప్పెన్లా ముంచుకురాకే చెలరేగి
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

చరణం:2

కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి రంగంలో దించాలా రంగేళి సింగారి
బేబీ బేబీ లావాని లాలిస్తావా లావణ్యమా చాల్లే కిల్లాడిని హంగామా
సంద్రాన్ని ముంచెత్తావా సెలయేరమ్మా ఏమంతా ఎల్లలు దాటే హోరమ్మా
ఏక్ బారు ఏక్ బారు దిల్కే పాస్ ఆజా బారు బారు కర్లే మజా
ఏక్ బారు ఏక్ బారు పొగరొద్దే పోకిరి బారు బారు లవ్ కిరికిరి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి