3, ఫిబ్రవరి 2025, సోమవారం

Iddaru Ammayilu : Naa Hrudayapu Kovelalo Song Lyrics (నా హృదయపు కోవెలలో..)

చిత్రం: ఇద్దరు అమ్మాయిలు (1970)

సాహిత్యం: దాశరథి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వసంత

సంగీతం: కె.వి. మహదేవన్




పల్లవి :

నా హృదయపు కోవెలలో....  ఆ... ఆ
నా బంగారు లోగిలిలో....  ఆ...  ఆ
ఆనందం నిండెనులే... 
అనురాగం పండెనులే
నా హృదయపు కోవెలలో...
నా బంగారు లోగిలిలో...  ఆ ఆ
ఆనందం నిండెనులే... 
అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...
నా హృదయపు కోవెలలో... 

చరణం 1 :

ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో...
మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో...
మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో...
నా మనసును నిలువునా దోచితివే
నా హృదయపు కోవెలలో...  

చరణం 2 :

అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం...
నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం...
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే...
నా బ్రతుకున కాపురముందువులే
నా హృదయపు కోవెలలో...  

చరణం 3 :

ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా...
ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా...
ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిథులతో...
వచ్చే పోయే అతిథులతో...
మన వాకిలి కళకళలాడునులే
నా హృదయపు కోవెలలో...
నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే... 
అనురాగం పండెనులే
నా హృదయపు కోవెలలో... 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి