16, ఫిబ్రవరి 2025, ఆదివారం

Naalo Vunna Prema : Veeche Chirugaali Song Lyrics (వీచే చిరుగాలి నడుగు)

చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కోటి

గానం: కె.యస్.చిత్ర

పల్లవి :

వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మనడుగు నాలో హొయలెన్నో
పారే సెలయేటినడుగు పాడే చిలకమ్మనడుగు నాలో లయలెన్నో
తొలి కిరణాలే తడిమినవేళ నిగ నిగ కలలెలెన్నో
వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మనడుగు నాలో హొయలెన్నో

చరణం : 1

ఆమని లో పూవనమే నా పరువు
మబ్బులలో పావురమే నా పయనం
పున్నమిలో సాగరమే నా హృదయం
పుప్పొడిలో పరిమళమే ప్రతి భావం
నా పెదవుల నవ్వులనడుగు
నా పదముల మువ్వలనడుగు
నా గుండెల సవ్వడినడుగు
నా పరుగుల సందడినడుగు
ప్రియ రాగలై మృదు గీతాలై పిలిచినదే స్వరమేధో

ప ద ప ద మ గ మ ద గ ప ద ప మ గ రి స స రి రి గ గ ప ప ద ద స స రి స ద ద ప గ రి స గ రి స గ రి రి స స ద ద ప రి స ద రి స ప రి స స ద ద ప ప గ స ని ని ద ద ప ప గ గ స గ రి రి స ద స రి

చరణం : 2

నా జాతకే చేరుకునే వెలుగేదో
నా యెడలో మేలుకునే కల యేదో
న వయసే కోరుకునే వరసేదో
నా సొగసే యేలుకునే మనసెదో
యెడరే ఉన్నది నే మజిలీ
పదపద అన్నాది ఓ మురళీ
త్వరగ రమ్మని ఒక రవళి
తరుముతువున్నది వెంటపడి
సుమధురగానం పలికిన స్నేహం యెదురుపడేదేపుడో

వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మనడుగు నాలో హొయలెన్నో
పారే సెలయేటినడుగు పాడే చిలకమ్మనడుగు నాలో లయలెన్నో
తొలి కిరణాలే తడిమినవేళ నిగ నిగ కలలెలెన్నో
హ హ హ హా ఆ హ హ హా లా ల ల లా ఆ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి