Nalo Unna Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nalo Unna Prema లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2023, ఆదివారం

Naalo Unna Prema : Veche Chirugaali (Female) Song Lyrics (వీచే చిరుగాలి నడుగు)

చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కోటి

గానం: మనో , కె.యస్.చిత్ర




వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మనడుగు నాలో హోయాలెన్నో పారే సెల యేటినడుగు పాడే చిలకమ్మ నడుగు నాలో..... లయలెన్నో .... తొలి కిరణా లే తడిమిన వేళ నిగ నిగ కళలెన్నో .... హో వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మ నడుగు నాలో.... హోయలెన్నో చరణం 1 ఆమనిలో పూవన మే నా పరువం మబ్బుల లో పావుర మే నా పయనం పున్నమిలో సాగరమే నా హృదయం పుప్పొడి లో పరిమళ మే ప్రతి భావం నా పెదవుల నవ్వుల నడుగు నా పదముల మువ్వల నడుగు నా గుండెల సవ్వడి నడుగు నా పరుగుల సందడి నడుగు ప్రియారాగాలై.....మృదుగీతాలై పిలిచినదే స్వరమే ... దో వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మ నడుగు నాలో హోయాలేన్నో ప ద ప ద మ గ మ ద గ ప ద ప మ గ రి స స రి రి గ గ ప ప ద ద స స రి స ద ద ప గ రి స గ రి స గ రి రి స స ద ద ప రి స ద రి స ప రి స స ద ద ప ప గ స ని ని ద ద ప ప గ గ స గ రి రి స ద స రి చరణం 2 నా జతకే చేరుకొనే వెలుగేదో నా ఎదలో మేలుకొనే కలయేదో నా వయసే కోరుకొనే వరసేదో నా సోగసే ఏలుకొనే మనసేదో ఏదరే ఉన్నది నీ మజిలి పద పద మన్నది ఓ మురళి త్వరగా రమ్మని ఆ రవళి తరుముతు ఉన్నది వెంటపడి సుమధుర గానం .... పలికిన స్నేహం ఎదురు పడేదేపుడో హో వీచే చిరుగాలి నడుగు పూచే విరి కొమ్మ నడుగు నాలో .... హోయలేన్నో పారె సెలయేటి నడుగు పాడే చిలకమ్మ నడుగు నాలో .... లయాలెన్నో తొలి కిరణా లే తడిమిన వేళ నిగ నిగ కళ లేన్నో హో హ హ హ హా ఆ హ హ హా లా ల ల లా ఆ


Naalo Vunna Prema : Enno Enno Song Lyrics (ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా)

చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కోటి

గానం: హరి హరన్, సుజాత



ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా హృదయంలో నిండిన నువ్వే ఎదురయితే మాటలు రావే ఈ మౌనం ఇద్దరి మధ్య ఇంకా ఎన్నాళ్ళు

ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా తెలుసా అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా

నిను చేరే తొందరలో వద్దన్నా వినదు కదా పడిపోదా ఎగిరే కన్నె ఎదా... పదిలంగా అందుకొని గుండెలలో దాచుకునే ప్రియ నేస్తం నేనున్నాను కదా ... అది నిజమైన అనలేదు నాతో అసలెపుడైనా అడిగావ నన్ను అడగాలని అనుకుంటూ ఉన్నా ఆ... అడుగెందుకు ముందుకు పడదో ఏమో పెదవుల్లొ అల్లరిగా తుళ్ళిపడే మువ్వలయే చిరునవ్వుల సందడి నీతలపే... ఓ నడిరాతిరి నిద్దురలో నాకలలే నడిపించే సిరివెన్నెల స్నేహం నీ పిలుపే... తలపులలోనే నువు దాగిపోకు మెలకువ రాని కలలెంత సేపు నీ మనసుని చదవాలనుకున్నా ఆ... వినకూడని బదులిస్తుందో ఏమొ



Naalo Unna Prema : O Naa Priyathama Song Lyrics (ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే)

చిత్రం: నాలో ఉన్న ప్రేమ (2000)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం: కోటి

గానం: మనో , కె.యస్.చిత్ర



ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే మనసును తాకి చనువుగా పిలిచే నీ లేఖను చదివిన మనకిదివరకే పరిచయమేదో ఉందని అనిపించినా ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే ఇన్ని సార్లు చదువుకొని మళ్ళీ మళ్ళీ తలచుకొని గుండె ఎంత మురిసినదో చెప్పలేను మరి ఎంతసేపు మదనపడి మాట మాట తడుముకుని పూర్తి కాని ఊహలతో నిన్ను చేరినది పైకి రాని గుండె సవ్వడి ఎలాగో నీకు విన్నవించుకున్నది ఆగని ఆశల సాగర కెరటమిది ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే తేనెలోని మధురిమలు వాన లోని సరిగమలు పూలలోని గుమగుమలు చేర్చి రాసినది వేదికైన హృదయముపై వేడుకైన మధురిమవై ఆలపించు రాధికల పలికే అష్ట పడి ప్రాణమంత పాట అయినది నీకోసం సాగుతున్న పయనమే ఇది ఆ ప్రియా రాగమే శ్వాసగా మారినది ఓ నా ప్రియతమా అనరాదే అప్పుడే అంత క్షేమమా అని అంటే చాలదే మనసును తాకి చనువుగా పిలిచే నీ లేఖను చదివిన మనకిదివరకే పరిచయమేదో ఉందని అనిపించినా ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో ఓహోవు ఓహోవు ఓహోవు ఓహో