చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: రమణ గోగుల
గానం: రమణ గోగుల , గంగ
పల్లవి :
బొంబాయి బొమ్మ సూడరా
దీని సిగతరగా మన ఇంట్లో అడుగుపెట్టరో
బుజ్జాయి పెళ్ళి పనుల్లో
బుజ్జాయి పెళ్ళి పనుల్లో
దీని సిగతరగా అర్జెంటుగా నడుం కట్టెరో
బొంబాయి బొమ్మ సూడరా
బొంబాయి బొమ్మ సూడరా
దీని సిగతరగా మన ఇంట్లో అడుగుపెట్టరా
చరణం : 1
సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్
చరణం : 2
స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి