Premante Idera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Premante Idera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, డిసెంబర్ 2021, మంగళవారం

Premante Idera : Nizam Babulu song Lyrics ( నైజాం బాబులు)

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, స్వర్ణలత



నైజాం బాబులు నాటు బాంబులు
అతిధులు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరంది కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అంది
వరుడు మా వాడండి
సేవలను పొందండి....
చేసుకోండి...

నైజాం బాబులు నాటు బాంబులు
అతిధులు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరంది కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అంది
వరుడు మా వాడండి
సేవలను పొందండి....
చేసుకోండి...


జర్దాలు పాన్ మసాలాలు పట్టుకురండి
జల్దీగా గోల్డప్లకులు తీసుకురండి
పానెసి ముద్దాడితే చేదుగా ఉంటుంది
ఆఆ... పొగతాగితే
మగతనమే హుష్కకావుతుంది

పేలని బాంబులు పిచ్చి
మొద్దులు బుద్దులు మీరంది
పద్దతి మార్చండి
ఉడకని పప్పులు నూతి
కప్పలు కోతలు మనది
మౌతులు  మూయండి

తొందరగా నల్లకొంగను తీసుకురండి
తక్షణమే కొండమీద కోతిని తెండి
మసిపూస్తే మీరేమో కొంగవుతారండి
ఆఆ.... మీ ఫ్రెండ్
ఉండంగా కొతేందుకు లెండి

తింగరి బాబులూ వెఱ్ఱికుంకాలు
గొర్రెలు మీరంది బుర్రలు పెంచండి
తిక్కల భామలు అరటి
తొక్కలు మీకాలు మీరంది
తోకలు మెడవండి
మీరు ఆడాలండి మాడి మాఘజాతంది
తాళి కట్టేవేళ
తలొంచాలి తప్పదు......

2, జూన్ 2021, బుధవారం

Premante Idera : Manase Eduru Tirige maata vinade (మనసే యెదురు తిరిగి మాట వినదే..)

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



మనసే యెదురు తిరిగి మాట వినదే.... కలిసే ఆశ కలిగి కునుకు పడదే... మొదలైన నా పరుగు ..నీ నీడలో నిలుపు... తుదిలేని ఊహలకు.. నీ స్నేహమే అదుపు ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు చరణం 1: కలలో మొదటి పరిచయం గురుతువుందా... సరెలే చెలిమి పరిమళం చెరుగుతుందా... చెలివైన చెంగలువా.. కలలోనె నీ కొలువా... చెలిమైన వెన్నెలవా... నిజమైన నా కలవా... నిను వీణగా కొనగోట మీటితే... నిదురపోగలవా చరణం 2: చినుకై కురిసినది కదా.. చిలిపి సరదా.. అలలై ఎగసినది కదా ...వలపు వరదా.. మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా వెతికే జతే కలిసి ..వయసు మరి ఆగనంది కదా... మనసే యెదురు తిరిగి మాట వినదే.... కలిసే ఆశ కలిగి కునుకు పడదే... మొదలైన నా పరుగు ..నీ నీడలో నిలుపు... తుదిలేని ఊహలకు.. నీ స్నేహమే అదుపు ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు

Premante Idera : Naalo Unna Prema Neetho cheppana Song Lyrics (నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా)

చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)

సంగీతం: రమణ గోగుల

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ... అంటానుగా మనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా ఇద్దరికీ వద్దిక కుదరక ఇష్టసఖీ వద్దని వదలక సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి తపించి తతంగ మడగగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా రెప్పలలో నిప్పులే నిగనిగ నిద్దురనే పొమ్మని తరమగ ఇప్పటితో అప్పుడు దోరకక వయ్యారి వయస్సు తయారయిందిగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ.. అంటానుగా మనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా