3, మార్చి 2025, సోమవారం

Kalyana Ramudu : Kathalo Rajakumari Song Lyrics (కథలో రాజకుమారి)

చిత్రం : కళ్యాణ రాముడు (2003)

సంగీతం : మణి శర్మ

గీతరచయిత : సాయి శ్రీ హర్ష

నేపధ్య గానం : కె. జె. యేసుదాస్

పల్లవి :

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........
హ్రుదయములోని మనసును రేపీ.......
బ్రతుకులలోని తీపిని చూపీ.........
కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు........ 

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........

చరణం : 1

ఆలయమందున్నది......... ఆరిపోనట్టి ప్రేమేరా..........
ఆకాశము నేల ఒకటై వచ్హేసి ఆశీస్సులిచ్హేనురా
ప్రేమొక పిచ్హిదిరా........ ప్రాణమిచ్హేంత మంచిదిరా.........
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ అందేనురా
కొరుకున్న కోరికలూ........సాగిపోవు దీపాలు...........
చేరువగును చేరికలూ......తీరిపొయి శాపాలు............
శుభకరములు, తన కరములు వరమాలై అల్లేరా......... 

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........

చరణం : 2

శ్రావణ మూర్తాలలో......... ప్రేమ ప్రమిదలు వెలిగేరా.........
తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా
బంగరు మేఘలురా.....రంగు పందిళ్ళు వేసేరా.........
కళ్ళకు దిద్దందగ ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా...........
తార బొట్టు పెట్టేను........తాళిబొట్టు అల్లేను........
నింగి వేదికేసేను....... చూడ వేడుకయ్యేను.......
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా..............

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........
హ్రుదయములోని మనసును రేపీ.......
బ్రతుకులలోని తీపిని చూపీ.........
కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు........ 

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి