8, మార్చి 2025, శనివారం

Kick : Gore Gore Song Lyrics (గోరే గొ గోరే...)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్, జ్యోత్స్న , ఎస్. థమన్ (కోరస్)

సంగీతం: ఎస్.తమన్


పల్లవి :
పో పో పొమ్మంటోందా
నన్ను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా..
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీ వల్ల
ఇదనా అదనా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గొ గోరే... చరణము : 1
తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం ..
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం
తుళ్లిపడదా నా సుకుమారం
మెల్లగ మీటితే నాలో మారం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా
గోరే గోరే..గోరే గొ గోరే...
చరణము : 2
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైన చెప్పదే సమయం..
నీతో నీకే నిత్యం యుద్ధం
ఎందుకు చెప్పవే సత్యభామా
ఏం సాధిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా
గోరే..గోరే...గోరే గొ గోరే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి