25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Bebbuli : Chicchu Buddi Lanti daani raa Song Lyrics(చిచ్చుబుడ్డిలాంటి దాన్నిరా )

చిత్రం: బెబ్బులి (1980)

సంగీతం: జె.వి. రాఘవులు

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి :

చిచ్చుబుడ్డిలాంటి దాన్నిరా చిచ్చు పెట్టి ఎల్లిపోకురా
పడుచు గుడెసె పంచుకోరా..
అజన సుజన విజన భజన జానకి రమణ

కుచ్చుటోపి నెత్తినెట్టనా... ఉచ్చులోకి నిన్ను లాగనా
గుడిసె మీద దెబ్బ తీయనా...
అజన సుజన విజన భజన జానకి రమణ

చరణం 1 :

ముప్పొద్దు సెంటులో ముంచేస్తా... ఈ పొద్దే సగం పొలం రాసిస్తా
ముప్పొద్దు సెంటులో ముంచేస్తా... ఈ పొద్దే సగం పొలం రాసిస్తా
కుంటిసాకు చెప్పకా.. గుంట సాగు చేసుకో...
పాలకంకి కాచుకో... పాడిపంట చూసుకో
అజన సుజన విజన భజన జానకి రమణ
అమ్మయ్యో అత్తయ్యో అప్పయ్యో సిగయ్యో చెప్పకు తపన 

చిచ్చుబుడ్డిలాంటి దాన్నిరా చిచ్చు పెట్టి ఎల్లిపోకురా
పడుచు గుడెసె పంచుకోరా..
అజన సుజన విజన భజన జానకి రమణ 

చరణం 2 :

మాపటేల మామూలు ఇచ్చేస్తే... ఏ మూలా నువ్వున్న వచ్చేస్తా
మాపటేల మామూలు ఇచ్చేస్తే... ఏ మూలా నువ్వున్న వచ్చేస్తా
జంట కలిపి వేయనా... పంట తలుపు తీయనా
తలుపు నువ్వు మూసినా దులుపు నేను చూడనా
అజన సుజన విజన భజన జానకి రమణ
అమ్మయ్యో అత్తయ్యో అప్పయ్యో సిగయ్యో చెప్పకు తపన 

కుచ్చుటోపి నెత్తినెట్టనా... ఉచ్చులోకి నిన్ను లాగనా
గుడిసె మీద దెబ్బ తీయనా...
అజన సుజన విజన భజన జానకి రమణ
అమ్మయ్యో అత్తయ్యో అప్పయ్యో సిగయ్యో చెప్పకు తపన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి