25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Bebbuli : Kanchipattu Cheeralona Song Lyrics (కంచిపట్టు చీరలోనా.. )

చిత్రం: బెబ్బులి (1980)

సంగీతం: జె.వి. రాఘవులు

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి :

కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు
ఎంచి ఎంచి చూసుకోనా.. ఏడు మల్లెలెత్తుదానా...
ఏడు మల్లెలెత్తుదానా...
కొండ చాటు కోన చూసి కొంగు పట్టనా...
గుండె చాటు కోరికుంది విప్పి చెప్పనా
కంబమెట్టు చెరువు కాదా... కొమ్ము దూసి బేరాలు
ఆపరోయి సందకాడా.. ఆరు ఊళ్ళ అందగాడా...
ఆరు ఊళ్ళ అందగాడా...  
రేపటేల కంటి మీద రెప్ప కొట్టనా...
రెప్పమాటు చూపు మాట విప్పి చెప్పనా
కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు
ఎంచి ఎంచి చూసుకోనా.. ఏడు మల్లెలెత్తుదానా...
ఏడు మల్లెలెత్తుదానా...

చరణం 1 :

ఆ చీరంచు చూస్తుంటే.. అల్లాడిమల్లాడి పోతుంటే
అది జీరాడి పారాడి అవ్వాయి చువ్వాయిలొతుంటే
ఆ చీరంచు చూస్తుంటే.. అల్లాడిమల్లాడి పోతుంటే
అది జీరాడి పారాడి అవ్వాయి చువ్వాయిలొతుంటే
అర్ధరాతిరా నిద్దరుండదు.. వద్ద చేరితే వయసు నిలవదు
కట్టుజారు పట్టు చీర కట్టు చూడు బెట్టు చూడు..
పట్టుకుంటే కందిపోనా..

అరేరే.. కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు
ఎంచి ఎంచి చూసుకోనా.. ఏడు మల్లెలెత్తుదానా... ఆ..
ఏడు మల్లెలెత్తుదానా...

చరణం 2 :

ఆ నూనూగు మీసాలు.. నూరాడు రోసాలు చూస్తుంటే
అహ.. నీ ఈడు జోడెక్కి... నా గుండె గూడెక్కి కూసుంటే
ఆ నూనూగు మీసాలు.. నూరాడు రోసాలు చూస్తుంటే
అహ.. నీ ఈడు జోడెక్కి... నా గుండె గూడెక్కి కూసుంటే
చుక్కలొచ్చినా వెన్నెలుండదు... వెన్నెలొచ్చినా చుక్క దక్కదు
పట్టుమాని బెట్టు తీసి గట్టు మీద పెట్టకుంటే...
నిన్నిడిసి పెడతానా... 

అరెరె... కంబమెట్టు చెరువు కాదా... కొమ్ము దూసి బేరాలు
ఆపరోయి సందకాడా.. ఆరు ఊళ్ళ అందగాడా...
ఆరు ఊళ్ళ అందగాడా...  
కొండ చాటు కోన చూసి కొంగు పట్టనా...
రెప్పమాటు చూపు మాట విప్పి చెప్పనా

కంచిపట్టు చీరలోనా.. పొంచి పొంచి ఉన్న అందాలు
ఆపరోయి సందకాడా.. ఆరు ఊళ్ళ అందగాడా...
ఆరు ఊళ్ళ అందగాడా...  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి