25, ఏప్రిల్ 2025, శుక్రవారం

Bebbuli : Paavuraayi Paapaayiro Song Lyrics (పావురాయి పాపాయిరో..)

చిత్రం: బెబ్బులి (1980)

సంగీతం: జె.వి. రాఘవులు

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి :

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో
దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే నాకు భలేగుందిరో...
భల్ భలేగుందిరో

చరణం 1 :

అల్లుకుంటే ఓ వెల్లువైనా అందాల గోదారి పొంగుందిరో
చల్లుకుంటే ఓ వెన్నెలంది... పరువాల జాబిల్లి రమ్మందిరో

కమ్ముకుంటే ఆ కౌగిలితే... కడలేని కడలల్లే పొంగిందిరో
నమ్ముకుంటే ఆ గుండెలోనే నా వలపు గుడి గంట మ్రోగిందిరో

అందంతో నా మదిలో అలజడులే రేపి
మనసైన మనుగడలు మీగడలు తీసి
కులికే నా చిలుకా భల్ భలేగుందిరో..
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

చరణం 2 :

వానలాగా నావాడు వస్తే...
వయసనక మనసంతా తడిసిందిరో
ఎండలాగా నావాడు చూస్తే...
నా ఒళ్ళు హరివిల్లు విరిసిందిరో

నేల మీద ఓ మెరుపులాగా...
నడిచిందా నా ఈడు ఉరిమిందిరో
నింగిలోనీ ఆ చుక్కలాగా
పొడిచిందా నా కోడి కూసిందిరో

తొలివలపు తొందరల పందిళ్లు వేసి
చేయ్ వెలితి చెరి సగమై చెలిమంతా చూసే
మనసు అది వయసో భల్ భలేగుందిరో...
భల్ భలేగుందిరో 

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

దువ్వుతుంటే రివ్వుమంటూ ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే నాకు భలేగుందిరో...
భల్ భలేగుందిరో

పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో... పాలకొల్లు బుజ్జాయిరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి