Aadavari Matalaku Ardhalu Veruley లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aadavari Matalaku Ardhalu Veruley లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Aadavari Matalaku Ardhalu Veruley : Naa Manasuki Song Lyrics (నా మనసుకి ప్రాణం పోసి)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: చంద్ర బోస్

గానం: కార్తీక్,గాయత్రి

సంగీతం: యువన్ శంకర్ రాజా



నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి  మది తెర తెరిచి ముగ్గె పరిచి ఉన్నావు లోకం మరిచి  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  నీ చూపుకి సూర్యుడు చలువాయె  నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె  నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయె మాయె  నీ అడుగుకి ఆకులు పువులాయె  నీ కులుకుకి కాకులు కవులాయె  నీ కలలకి నీ కథలకి కదలాడె హాయె హాయె  అందంగ నన్నె పొగిడి అటుపైన ఏదొ అడిగి  నా మనసనె ఒక సరసులొ అలజడులె సృష్టించావె  నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి  నిలిచావె ప్రేమను పంచి  ఒక మాట ప్రేమగ పలకాలె  ఒక అడుగు జతపడి నడవాలె  ఆ గుర్తులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం  ఒక సారి ఒడిలొ ఒదగాలె  ఎద పైన నిదరె పోవాలె  తియతియ్యని నీ స్మృతులతొ బ్రతికేస్త నిమిషం నిమిషం  నీ ఆసలు గమనించానే నీ ఆతృత గుర్తించాలె  ఎటు తేలక బదులీయక మౌనంగ చూస్తున్నాలె


Aadavari Matalaku Ardhalu Veruley : Emaindhi Eevela Song Lyrics (ఏమైంది ఈ వేళ)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: యువన్ శంకర్ రాజా


ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల.. ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మొహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల.. ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా

Aadavari Matalaku Ardhalu Veruley : Allantha Doorala Song Lyrics (అల్లంత దూరాల ఆ తారక)

చిత్రం: ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే (2007)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: యువన్ శంకర్ రాజా



అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిదీ.. సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగా దిగివచ్చినొ ఏవో దివి కానుక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందోయ్ అందరిని నిలబడనీకా ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా