చిత్రం: ఆనందం (2001)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్, కె.యస్.చిత్ర
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎవరైనా ఎపుడైన సరిగా గమనించారా చలి చెర అసలెప్పుడు వదిలిందో అణువణువు మురిసెలా చిగురాసలు మెరిసెలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలొస్తుంది పొగమంచును పొపొ మంటూ తరిమేస్తుంది నేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది తన రూపం తానె చూసి పులకిస్తుంది రుతువెప్పుడు మారిందో బ్రతుకెప్పుదు విరిసిందో మనసెప్పుడు వలపుల వనమైందొ
ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా నడి రాతిరి తొలి వేకువ రేఖా నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించె ఒక చల్లని మది పంపిన లేఖా గగనాన్ని నేలని కలిపె వీలుందని చూపేలా కేరింతల వంతెన ఇంకా ఎక్కదిదాక చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా అక్షరము అర్ధం కాని ఈ విధి రాత కన్నులకే కనపదని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ