చిత్రం: ఆవేశం (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి ఒడిలోకి రారమ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తర్ఫీదు కానిమ్మని అయితే పోరి చూపెయ్ రాదారి పడతా పని ప్యారీ కానీ చోరి కసిగా ఓ సారి నీదే చిన్నారి అమ్మడు బీ రెడీ తట్టుకో తాకిడి చీకటింటి చిలిపి గారడి నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి ఒడిలోకి రారమ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తర్ఫీదు కానిమ్మని చరణం: 1 పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఫరవాలేదన్నారు పెద్దవాళ్లు యెస్సు బాసు కిస్సు బాసు సావిట్లో ఒకసారి సందిట్లో ఒకసారి చలి కాగాలన్నారు చిన్నవాళ్లు యెస్సు బేబీ కిస్సు బేబి కొక్కొరో బంగారు కోడి ముద్దెడితే ముదిరింది వేడి పిల్లగో చూసా నీ నాడి అదిరింది కన్నె బాడీ గుట్టుగా దోపిడి చెయ్యనా గుమ్మడి తాళలేను తీపి రాపిడి ఓయ్ ఓయ్ ఓయ్ నిన్నేమడగను ఎట్టా అడగను ఒకసారి ఒడిలోకి రారమ్మని నీకేం చెప్పను ఎట్టా చెప్పను తెరచాటు తర్ఫీదు కానిమ్మని చరణం: 2 సరిగంగా స్నానాలా సవరింపు యోగాలా వేళాయేనన్నాది చందమామ యెస్సు బేబీ కిస్సు బేబీ చప్పట్ల మడి తాళం దుప్పట్ల తడి మేళం పెట్టించమన్నాది కలువ భామ యెస్సు బాసు వెయ్యి డోసు ఎక్కడో కుట్టింది చీమ ఉప్పెనలా ఉబికింది ప్రేమా అక్కడే గుప్పిస్తా భామా పెదవులతో తేనె చుమ్మా అమ్మనీ జిమ్మడా హత్తుకో పిల్లడా పొంగుతోంది పాల మీగడా నిన్నేమడగను ఎట్ట ఎట్ట ఎట్టా అడగను ఒకసారి ఒడిలోకి రారమ్మని నీకేం చెప్పను ఎట్ట ఎట్ట ఎట్టా చెప్పను తెరచాటు తర్ఫీదు కానిమ్మని