Aditya 369 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aditya 369 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2022, గురువారం

Aditya 369 : Centurylu Kotte Song Lyrics (సెంచరీలు కొట్టే వయస్సు మాది)

చిత్రం: ఆదిత్య  369 (1991)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి

సంగీతం:ఇళయరాజా 



సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

చాకిరీ నైనా మజా జావళీలు చేసే

పాడు సోలో, ఇక వీడియో లో, వీడియో లో, చెలి జోడీ ఓ లో

సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

  మేఘ మాలనంటుకున్న ఆంటెన్నాలతో మెరుపు తీగ మీటి చూడు తందానాలతో

సందెపొద్దు వెన్నెలంటూ చందనలతో వలపు వేణువూది చూడు వందనలతో   చక్రవాక వర్షాగీతి, వసంత వేళ పాడు తుళ్ళి పడ్డ ఈడు జోడు, తుఫాను లో

కన్నె పిల్ల వాలు చూపు, కరెంటు షాక్ తిన్న కుర్ర వాళ్ళ ఈల పాట, హుషారులో 

లైఫ్ వింత డాన్స్ ,లిఖించు కొత్త ట్యూన్స్ ఉన్నదొక్క ఛాన్స్, సుఖించమంది సైన్స్ వాయులీన హాయి గాన రాగ మాలలల్లుకున్న వేళ   

సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

చాకిరీ నైనా మజా జావళీలు చేసే

పాడు సోలో, ఇక వీడియో లో, వీడియో లో, చెలి జోడీ ఓ లో 

సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

  

వెచ్చనైన ఈదుకున్న వేవ్ లెంగ్త్ లో రెచ్చి రాసుకున్న పాఠకుణ్ణి పంక్తులో 

విచ్చుకున్న పొద్దు పువ్వు ముద్దు తోటలో 

కోకిలమ్మ పాఠకుణ్ణి కొత్త గొంతులో   ఫాక్స్ కార్డు బీట్ మీద, పదాలు వేసి చూడు హార్ట్ బీట్ పంచుకున్న, లిరిక్ లో కూచిపూడి గజ్జె మీద, కావాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత, కథకు లో 

నిన్న మొన్న కన్నా, నిజ నిజాలకన్నా 

గత గతాలకన్నా, ఇవాళ నీది కన్నా పాటలన్నీ పువ్వులైన తోట లాంటి లేత యవ్వనాన  

సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

చాకిరీ నైనా మజా జావళీలు చేసే

పాడు సోలో, ఇక వీడియో లో, వీడియో లో, చెలి జోడీ ఓ లో 

సెంచరీలు కొట్టే వయస్సు మాది

బౌండరీలు దాటే మనస్సు మాది

జింగ్ నాకు చర్చ, జి జిక్కి చర్చ

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

Aditya 369 - Suramodamu Song Lyrics (సురమోదము శుభ నాట్య వేదము)

చిత్రం: ఆదిత్య  369 (1991)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి , సునంద

సంగీతం:ఇళయరాజా 



సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా స్వరరాగ సంగమ సార్ధక జీవన సురగంగ పొంగిన నర్తనశాలల పదములు చేరగ భంగిమలూరె సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా ఘటనా ఘటనాల కదలికలెన్నెన్నొ దాచెనులే కడలి నటనా కిరణాల నడకలు నేర్చింది నేరిమితో నెమలి రాయని చదువె రసనలు దాటె రాయల సన్నిధిలొ ఆమని రుతువె పువ్వును మీటె నాట్య కళావనిలొ నాకు వచ్చు నడకల గణితం నాది కాక ఎవరిది నటనం నాకు చెల్లు నవ విధ గమకం నాకు ఇల్లు నటనల భరతం ఉత్తమోత్తమము వృత్త గీతముల ఉత్తమోత్తమము వృత్త గీతముల మహా మహా సభా సదులు మురిసిన సురమోదము శుభ నాట్య వేదము నటియింపగ తరమా జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా స్పందించె వసంతాలు తకఝను హంపి శిల్ప శృంగారమై సర్వానంద రాగాల రసధుని సర్వామూద సంగీతమై నాలొ పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కళ్హారమై నాలొ ఉన్న చిన్నారి కలలివి నాన చిత్ర వర్ణాంకమై వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ భరతము నెరుగని నరుడట రసికుడు రాక్ రోల్ ఆట చూడు బ్రేకులోని సోకు చూడు వెస్ట్ సైడ్ రైం మీద ట్విస్ట్ చేసి పాడి చూడు పాత కొత్త మేళవింపు వింత చూసి వంత పాడు రాక్ రాక్ రాక్ అండ్ రోల్ షేక్ షేక్ షేక్ అండ్ రోల్ రాక్ రాక్ రాక్ అండ్ రోల్ షేక్ షేక్ షేక్ అండ్ రోల్ జనగీతము శివ పాద జాతము వచియింపగ వశమా 

4, జూన్ 2021, శుక్రవారం

Aditya 369 : Janavule Nerajanavule Song Lyrics (నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో)

చిత్రం: ఆదిత్య  369 (1991)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, జిక్కి

సంగీతం:ఇళయరాజా 


నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో అహహా హహా మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా... జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలలో వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా... జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

31, మే 2021, సోమవారం

Aditya 369 : Rasaleela Vela Song Lyrics (రాసలీల వేళ రాయబారమేల )

చిత్రం: ఆదిత్య  369 (1991)

రచన: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ,జిక్కి

సంగీతం:ఇళయరాజా 


పల్లవి : రాసలీల వేళ రాయబారమేల .. మాటే.. మౌనమై.. మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల చరణం 1 కౌగిలింత వేడిలో.. కరిగే వన్నె వెన్నల తెల్లబోయి వేసవి ..చల్లే పగటి వెన్నెల మోజులన్నీ పాడగా.. జాజిపూల జావళి కందేనేమో కౌగిట.. అందమైన జాబిలి తేనే వానలోన చిలికే తీయనైన స్నేహము మేని వీణలోన పలికే సోయగాల రాగము నిదురరాని కుదురులేని ఎదలలోని సోదలు మాని రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల చరణం 2 మాయజేసి దాయకు.. సోయగాల మల్లెలు మోయలేని తీయని ..హాయి పూల జల్లులు చేరదీసి పెంచకు .. భారమైన యవ్వనం దోర సిగ్గు తుంచకు ..ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాల అలల ఊయలూగనా చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా చలువ సోకు కలువ రేకు కలువ సోకి నిలువనీదు రాసలీల వేళ రాయబారమేల మాటే మౌనమై మాయజేయనేల రాసలీల వేళ రాయబారమేల రాసలీల వేళ రాయబారమేల