4, జూన్ 2021, శుక్రవారం

Aditya 369 : Janavule Nerajanavule Song Lyrics (నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో)

చిత్రం: ఆదిత్య  369 (1991)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, జిక్కి

సంగీతం:ఇళయరాజా 


నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో అహహా హహా మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ మరి అందుకు విరి పానుపు సవరించవేమిరా... జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో చీకటి కోపం చెలిమికి లాభం... కౌగిలలో వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా... జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే సన్నలలో గుసగుస తిమ్మెరలే మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో జాణవులే వరవీణవులే గిలిగించితాలలో ఆహాహహా జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి