Amarajeevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amarajeevi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2025, సోమవారం

Amarajeevi : Odarpu Kanna Song Lyrics (ఓదార్పుకన్న చల్లనిది.. )

చిత్రం : అమరజీవి (1983)

సంగీతం : చక్రవర్తి

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి



పల్లవి : 

ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని 
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ 
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని 
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ 

చరణం 1: 

వేదాలకైన మూలమది.. నాదాలలోన భావమది 
దైవాలకైన ఊయలది.. కాలాలకన్న వేదమది 
కన్నీళ్ళు మింగి బ్రతికేది.. అదిలేనినాడు బ్రతుకేది 
నీకై జీవించి.. 
నిన్నే దీవించి.. 
నీకై మరణించు.. 
జన్మజన్మల ఋణమీ ప్రేమ 
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని 
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ 

చరణం 2 : 

లయమైన సృష్టి కల్పములో.. చివురించు లేత పల్లవిది 
గతమైనగాని రేపటిది.. అమ్మలనుగన్న అమ్మ ఇది 
పూలెన్ని రాలిపోతున్నా.. పులకించు ఆత్మగంధమిది 
నిన్నే ఆశించి.. 
నిన్నే సేవించి.. 
కలలే అర్పించు.. 
బ్రతుకు చాలని బంధం ప్రేమ 
ఓదార్పుకన్న చల్లనిది.. నిట్టూర్పుకన్న వెచ్చనిది 
గగనాలకన్న మౌనమిది.. అర్చనగా..ద ద ద ని 
అర్పనగా.. ని ద ని స.. దీవెనగా.. లాలనగా.. వెలిగే ప్రేమ

Amarajeevi : Mallepoola Maa Raniki Song Lyrics (మల్లెపూల మా రాణికి)

చిత్రం : అమరజీవి (1983)

సంగీతం : చక్రవర్తి

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి:

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణి
మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ
మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

చరణం 1:

పొగడపూలైనా పోగడే అందాలే మురిసే మలిసంధ్య వేళలో
మల్లె మందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా.... ఆలాపనే.. 
నీ.... ఆరాధనై... 
చిరంజీవిగా దీవించనా... హ్యాపీ బర్డే టూ యూ

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

చరణం 2:

రెల్లు చేలల్లో రేయివేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో
నీ.... సౌభాగ్యమే.. 
నా.... సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా...  హ్యాపీ బర్డే టూ యూ

మల్లెపూల మా రాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ

Amarajeevi : Asurasandhyavela Song Lyrics (అసుర సంధ్య వేళ)

చిత్రం : అమరజీవి (1983)

సంగీతం : చక్రవర్తి

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల



సాకి :  

శ్రీ రంగనాధ చరణారవింద చారణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుదమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజలకు పువ్వుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహమునకు... పరమునకు నీదాననై.. ధన్యనై..
జీవన వదాన్యనై  తరియించుదాన.. మన్నించవే... మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియసేవిక .. దేవ దేవి. .

పల్లవి :

అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామి...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి?
స్వామీ...  స్వామీ... స్వామీ
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవి ..
స్వామి ఉసురు తగలనీకు దేవి..
మరులుకొన్న హరిని వీడి...  
మరలిన ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవి... దేవీ..

చరణం 1 :

హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు
హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు
నిగ తత్వములను తెలిసి.. నీమ నిష్ఠలకు అలసి
పూనిన శృంగార యోగమిది కాదని .. నను కాదని..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడదారి 
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామి..
ఆడ ఉసురు తగలనీకు స్వామి... 
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవి ..
స్వామి ఉసురు తగలనీకు దేవీ..

చరణం 2 : 

నశ్వరమది..నాటక మిది...నాలుగు గడియల వెలుగిది..
కడలిని కలిసే వరకే... కావేరికి రూపు ఉన్నది
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగ వల్లికను కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ... 
అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామి ఉసురు తగలనీకు దే..వీ...

చరణం 3 : 

అలిగేనిట శ్రీరంగము.. తొలగేనట వైకుంఠము
యాతన కేనా దేహము?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము...  వీక్షణమే మరు దాహము
రంగా! రంగా... రంగ రంగ శ్రీ రంగ  !!
ఎటులోపను...ఎటులాపను?
ఒకసారి.. అ.. అ.. అనుభవించు ఒడి చేరి..


Amarajeevi : Ela Gadapanu Song Lyrics (ఎలా గడపను ఒక మాసం)

చిత్రం : అమరజీవి (1983)

సంగీతం : చక్రవర్తి

రచన: వేటూరి సుందరరామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి


పల్లవి :

ఎలా..
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం
ఆ..ఆ..ఆ..ఆ..అహ..
ఆ..ఆ..ఆ..ఆ..అహ.. 
ముప్పైపోయిన చలి మాసం.. ముద్దే దొరకని సన్యాసం
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిసద.. దనిద.. దమద.. నిదమ..గమద.. గమగస
సదా.. గదా.. మని..దస.. రిరినిససదస.. నిసదని మదదని గమదస

చరణం  1 :

ఎలా..
ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం
ఆ.. ఆ.. ఆ.. అహా..
చిగురు వేసినా శృంగారం... పండు దొరకని ఫలహారం
ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆ.. ఆ.. ఆ..ఆ
పపపపమపగమ రిరిసప.. నిదగమని.. నిదనినిస..
మపస.. గమగరిసా..

చరణం 2 :

ఎలా..
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం
ఆ.. ఆ.. ఆ.. ఆహా.. హా
ఆ.. ఆ.. ఆ.. ఆహా.. ఆ...
కరిగిపోనీ ఈ క్షణం క్షణం..
పెంచుతున్నది విరహ యుగం
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం