చిత్రం : అమరజీవి (1983)
సంగీతం : చక్రవర్తి
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
పల్లవి :
ఎలా..
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం
ఆ..ఆ..ఆ..ఆ..అహ..
ఆ..ఆ..ఆ..ఆ..అహ..
ముప్పైపోయిన చలి మాసం.. ముద్దే దొరకని సన్యాసం
ఎలా గడపను ఒక మాసం... ముప్పై రోజుల ఉపవాసం
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
నిసద.. దనిద.. దమద.. నిదమ..గమద.. గమగస
సదా.. గదా.. మని..దస.. రిరినిససదస.. నిసదని మదదని గమదస
చరణం 1 :
ఎలా..
ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం
ఆ.. ఆ.. ఆ.. అహా..
చిగురు వేసినా శృంగారం... పండు దొరకని ఫలహారం
ఎలా గడపను ఒక వారం.. ఏడు రాత్రుల జాగారం
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆ.. ఆ.. ఆ..ఆ
పపపపమపగమ రిరిసప.. నిదగమని.. నిదనినిస..
మపస.. గమగరిసా..
చరణం 2 :
ఎలా..
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం
ఆ.. ఆ.. ఆ.. ఆహా.. హా
ఆ.. ఆ.. ఆ.. ఆహా.. ఆ...
కరిగిపోనీ ఈ క్షణం క్షణం..
పెంచుతున్నది విరహ యుగం
ఎలా గడపను ఈ ఒక్క దినం...
ఎంత గడిపినా ఒక్క క్షణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి