Amavaasya Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Amavaasya Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జనవరి 2024, శనివారం

Amavasya Chandrudu : Kalake Kala Nee Andamu Song Lyrics (కళకే కళ ఈ అందమూ)

చిత్రం: అమావాస్య చంద్రుడు (1981)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా




మ్మ్ మ్ మ్ మ్ మ్ హాఆఆహా దరరారరారర దరారరరారర కళకే కళ ఈ అందమూ ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ కళకే కళ ఈ అందమూ నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో కోల కనులు పంతాలాడే గండుమీలతో వదనమో జలజమో నుదురదీ ఫలకమో చెలి కంఠం పలికే శ్రీ శంఖము కళకే కళ ఈ అందమూ.... పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ చూపులో తూపులో చెంపలో కెంపులో ఒక అందం తెరలో దోబూచులు కళకే కళ ఈ అందమూ.... తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో ఈ రూపం ఇలలో అపురూపము కళకే కళ ఈ అందమూ....

26, మార్చి 2022, శనివారం

Amavaasya Chandrudu : Sundaramo Sumadhuramo Song Lyrics (సుందరమో సుమధురమో)

చిత్రం: అమావాస్య చంద్రుడు (1981)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి, టి. వి. గోపాలకృష్ణన్

సంగీతం: ఇళయరాజా




సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో ఆనందాలే భోగాలైతే, హంసా నంది రాగాలితే నవ వసంత గానలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మొగేనులే వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోణాలలో మావుల కొమ్మల  ఊగిన కోయిల వేణువు లుదిన గీతికలు సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

అందాలన్నీ అందే వేళ, బంధాలన్నీ పొందే వేళ కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగామమేదో సాగేనులే కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో మల్లెల తావుల పిల్లన గ్రోవులు  పల్లవి పాడిన పందిరిలో సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో మలయజ మారుత శీకరమో, మనసిజ రాగవ శీకరమో సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో