13, జనవరి 2024, శనివారం

Amavasya Chandrudu : Kalake Kala Nee Andamu Song Lyrics (కళకే కళ ఈ అందమూ)

చిత్రం: అమావాస్య చంద్రుడు (1981)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా




మ్మ్ మ్ మ్ మ్ మ్ హాఆఆహా దరరారరారర దరారరరారర కళకే కళ ఈ అందమూ ఏ కవీ రాయనీ చేయనీ కావ్యమూ కళకే కళ ఈ అందమూ నీలి కురులు పోటీ పడెను మేఘమాలతో కోల కనులు పంతాలాడే గండుమీలతో వదనమో జలజమో నుదురదీ ఫలకమో చెలి కంఠం పలికే శ్రీ శంఖము కళకే కళ ఈ అందమూ.... పగడములను ఓడించినవి చిగురు పెదవులు హా వరుస తీరి మెరిసే పళ్ళు మల్లె తొడుగులూ చూపులో తూపులో చెంపలో కెంపులో ఒక అందం తెరలో దోబూచులు కళకే కళ ఈ అందమూ.... తీగెలాగ ఊగే నడుమూ ఉండి లేనిదీ దాని మీద పువ్వై పూచీ నాభి ఉన్నదీ కరములో కొమ్మలో కాళ్ళవీ బోదెలో ఈ రూపం ఇలలో అపురూపము కళకే కళ ఈ అందమూ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి