చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరురుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది ఆరురుచులు తగలగానే అమ్మే చేదవుతుంది రోమ్మేగా ... రోమ్మేగా అందించెను జీవితాన్ని నోటికి అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు
ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు అమ్మంటే ...అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ అమ్మంటే రాజీనామా ఎరగని ఒక నౌకరి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం