చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా శలవిమ్మని అడిగితే... ఇక శలవిమ్మని అడిగితే... ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా శలవిమ్మని అడిగితే... ఇక శలవిమ్మని అడిగితే... ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి