Anandam Ambaramaithae లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Anandam Ambaramaithae లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2024, శుక్రవారం

Anandam Ambaramaithae : Mem Godarolla Mandi Song Lyrics (ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!)

చిత్రం: ఆనందం అంబరం ఐతే (2020)

రచన: నూజిళ్ల శ్రీనివాస్

గానం: గీతా మాధురి, పార్థసారథి

సంగీతం: శ్రీ కృష్ణ



పల్లవి: ఆయ్..మేము గోదారోళ్ళమండీ......! ఆయ్..మేము గోదారోళ్ళమండీ......! మా మడుసులు మిన్నండి... మా మనసులు ఎన్నండి.... ఉప్పు, కారం మాట ఏమో గాని, ఎటకారం మాకు ఎంతో రుసండి..! చరణం-1: పెద్దలంటే మరియాదండీ – మాకు పేద- గొప్ప బేదం లేదండి.. కులము, గోత్రం మాట ఎట్టున్నా.. మాకు ఊరంత సుట్టాలేనండి../ ఊరంతా వరసలేనండి అబిమానం మా ఇంటిపేరండి.........2 ఆతిథ్యం మా ఆరో పేనమండి.........ఆయ్... చరణం-2: దేవతలకిది నెలవండి.. గొప్ప/ దేవుళ్ళందరికి నెలవండి.. గొప్ప వేద పండితుల కొలువండి ..... పండగలు, పబ్బాలంటే – అబ్బ సెప్పలేని సందడేనండి.. మేజువాణి మేళం మాకు మోజండి....2 కోడిపందాలంటే శాన ఇష్టమండి...ఆయ్.... చరణం-3: పూతరేకు రుసి మాదండి – మడత, గొట్టం – కాజాలూ మావండి ఖైరతబాదూ గణపయ్యా- మెచ్చే లడ్డు కూడా మాదేనండి తిండి పెట్టి మమ్ము సంపేత్తారంటూ-2 తిన్నోళ్ళు సరదాగ అంటుంటరండీ....ఆయ్ చరణం-4: అన్నదాతలం మేమండీ –సాఫ్టు వేరు వీరులం మేమండి అంబాజీపేట నుంచీ - అమెరిక దేశందాక మేమేనండి.. ఫేసు బుక్కైనా – ఫేసు టు ఫేసయిన-2 మాతో మాటలంటే మంచిగుంటదండీ... ఆయ్ చరణం-5: సినిమాలంటే మహా పిచ్చండి – కాని సంప్రదాయాలకు రిచ్చండి బాస లోన కొంత యాసున్నా – మాట తేనెలూరుతుంటాదండీ గోదారమ్మ నీళ్ళ సలవతో -2 

ఎదిగిన కొద్దీ ఒదిగుంటమండీ...ఆయ్