చిత్రం: ఆనందం అంబరం ఐతే (2020)
రచన: నూజిళ్ల శ్రీనివాస్
గానం: గీతా మాధురి, పార్థసారథి
సంగీతం: శ్రీ కృష్ణ
పల్లవి:
ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!
ఆయ్..మేము గోదారోళ్ళమండీ......!
మా మడుసులు మిన్నండి...
మా మనసులు ఎన్నండి....
ఉప్పు, కారం మాట ఏమో గాని,
ఎటకారం మాకు ఎంతో రుసండి..!
చరణం-1:
పెద్దలంటే మరియాదండీ – మాకు
పేద- గొప్ప బేదం లేదండి..
కులము, గోత్రం మాట ఎట్టున్నా.. మాకు
ఊరంత సుట్టాలేనండి../ ఊరంతా వరసలేనండి
అబిమానం మా ఇంటిపేరండి.........2
ఆతిథ్యం మా ఆరో పేనమండి.........ఆయ్...
చరణం-2:
దేవతలకిది నెలవండి.. గొప్ప/ దేవుళ్ళందరికి నెలవండి.. గొప్ప
వేద పండితుల కొలువండి .....
పండగలు, పబ్బాలంటే – అబ్బ
సెప్పలేని సందడేనండి..
మేజువాణి మేళం మాకు మోజండి....2
కోడిపందాలంటే శాన ఇష్టమండి...ఆయ్....
చరణం-3:
పూతరేకు రుసి మాదండి – మడత,
గొట్టం – కాజాలూ మావండి
ఖైరతబాదూ గణపయ్యా- మెచ్చే
లడ్డు కూడా మాదేనండి
తిండి పెట్టి మమ్ము సంపేత్తారంటూ-2
తిన్నోళ్ళు సరదాగ అంటుంటరండీ....ఆయ్
చరణం-4:
అన్నదాతలం మేమండీ –సాఫ్టు
వేరు వీరులం మేమండి
అంబాజీపేట నుంచీ - అమెరిక
దేశందాక మేమేనండి..
ఫేసు బుక్కైనా – ఫేసు టు ఫేసయిన-2
మాతో మాటలంటే మంచిగుంటదండీ... ఆయ్
చరణం-5:
సినిమాలంటే మహా పిచ్చండి – కాని
సంప్రదాయాలకు రిచ్చండి
బాస లోన కొంత యాసున్నా – మాట
తేనెలూరుతుంటాదండీ
గోదారమ్మ నీళ్ళ సలవతో -2 ఎదిగిన కొద్దీ ఒదిగుంటమండీ...ఆయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి