Andala Rakshasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Andala Rakshasi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జులై 2021, గురువారం

Andala Rakshasi : Ye Mantramo Song Lyrics (యే మంత్రమో.)

చిత్రం:అందాల రాక్షసి(2012)

సంగీతం: రాధన్

సాహిత్యం: వశిష్ట శర్మ

గానం: బోబో శశి



యే మంత్రమో.. అల్లేసిందిలా యెదకే.. వే..సే.. సంకెలా భూమెందుకో.. వనికిందే ఇలా బహుశా తనలో.. తపనకా ఆకాశం.. రూపం.. మారిందా నా కోసం.. వానై.. జారిందా గుండెల్లో.. ప్రేమై.. చేరిందా ఆ ప్రేమే.. నిన్నే.. కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నెలాయే మనసంతా మాయమాయే అయినా హాయే క్షణము ఒక ఋతువుగ మారే ఉరుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలై పోయే.. కొత్తగా ఉన్నట్టు ఉంది అడుగులు ఎగిరే పగలు వల విసిరె ఊహలే మనసు మతి చెదరగ.. శిలగ నిలిచెగా కల్లల్లో కదిలిందా.. కలగా.. కల.. కరిగిపోకలా ఎదురయ్యే.. వేళల్లో.. నువ్వు ఎగిరి పోకలా ఓ మాయలా.. ఇంకో మాయలా నన్నంత మార్చేంతలా ఓ మాయలా.. ఇంకో మాయలా నువ్వే నేనయ్యేంతలా.. వెన్నెల్లా

Andala Rakshasi : Vennante Song Lyrics (వెన్నంటే ఉంటున్న)

చిత్రం:అందాల రాక్షసి(2012)

సంగీతం: రాధన్

సాహిత్యం:కృష్ణ కాంత్

గానం: రంజిత్ 



వెన్నంటే ఉంటున్న కడదాకా వస్తున్న నా ప్రాణం నీదన్న ప్రేమ నీ నవ్వుల తానన నేనేపుడో పడిపోయా తప్పంతా నీదెగా ప్రేమ అరకొరగా సరిపోన కసరకలా సరే పోనా కోపంగా చూస్తున్న నీ నవ్వై నే రానా బస్సెక్కిన నెరజాణ ఆఖేన్ దిల్ మే బస్ జాన మిస్సయ్యిన మిసైల్ లాగ నాపై ఫైర్ ఎలా అటు ఇటు ఎటు పరిగెడుతున్న వేణు తిరిగితే నేనే ఉన్న అలుపెరుగని సుర్యున్నేనే నాతో పంతాల పారిపోకే నువ్వు డే టైముల్లో ఉన్నట్టేలే నా ఒళ్లొ జారిపోకే రాతిరి రహదారుల్లో మూనై రానా మఫ్టిలో కదిలించే నిదురవన భాదించే హాయినవనా కలబడితే గెలుపవనా విసురుగ నన్నే విసిరేసిన నను తరిమే దూరమవన నిను తాడిమే కరమవనా చుక్కల్లో దాక్కున్నా  నీ పక్కన నేనున్నా ఉరికే నడికెటు చూస్తున్న నే లేన ఊ అంటే నిజమవుతా కాదంటే కల నవుతా వద్దన్నా ఎదురవుతా లేమ్మా స్వర్గంలో నేనుంట నీకోసం చూస్తుంట మొదలైన మరు జన్మ మారదులే నీ కర్మ

Andala Rakshasi : Yemito Ivvala Song Lyrics (ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు)

చిత్రం:అందాల రాక్షసి(2012)

సంగీతం: రాధన్

సాహిత్యం: రాకేందు మౌలి

గానం: హరిచరన్


శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇక పై నా జీవితం. శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం... ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే
కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి
ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే...
ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా! నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా! నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా! లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా! జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు
తాకి తడిసిందిలే నాలో ప్రాణమే! ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా! గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిశ్శ్వాసలా! నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా? నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ…