చిత్రం: అనుబంధం(1984)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం: కే. చక్రవర్తి
పల్లవి:
జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి సాయంత్రం చెలరేగే సంగీతం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే ఇద్దరున్న కౌగిట్లో ముద్దుతీర్చి పోవే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నాలో చూడు దగ్గరైన ప్రాణాలు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం సందెపొద్దువేళాయే చందమామ రావే చీకటైన పొదరింట దీపమెట్టిపోవే నన్నే తాకే అగ్గిపూల బాణాలు నాకే సోకే కొంటెచూపు కోణాలు చరణం 1: పువ్వుల వానల్లో నవ్వుల నావల్లే నావంక వస్తుంటే నాజూకు తీస్తుంటే వెచ్చని వెలుగుల్లో వచ్చిన వయసల్లే వాటేసుకుంటుంటే వైనాలు చూస్తుంటే సూరీడేమో కొండలు దాటే నా ఈడేమో కొంగులు దాటే నీ ముద్దు తాంబూలమిచ్చుకో ఎర్రంగ వలపే పండించుకో తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు నిన్నే చేరే నిన్నలేని నడకివ్వు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చరణం 2: కొండకోనల్లో ఎండవానల్లో మురిపాల ముంగిట్లో ముద్దాడుకుంటుంటే వేసవి చూపుల్తో రాసిన జాబుల్తో అందాల పందిట్లో నిన్నల్లుకుంటుంటే అల్లరి కళ్ళు ఆరాతీసే దూరాలన్ని చేరువచేసే ఒడిచేరి పరువాలు పంచుకో బిడియాల గడపింక దాటుకో నింగి నేల తొంగి చూసే సాక్ష్యాలు నీకు నాకు పెళ్ళిచేసే చుట్టాలూ జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ చలిగాలి చెలగాటం చెలరేగే ఉబలాటం పొద్దువాలే వేళాయే ముద్దుగుమ్మా రావే సందెపొద్దువేళాయే చందమామ రావే నీలో చూసా సిగ్గుపడ్డ పరువాలు నన్నే తాకే అగ్గిపూల బాణాలు జింజింతారారే ఏ ఏ జింజింతారారే ఏ ఏ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి