Aradhana (1976) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aradhana (1976) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Nede telisindi song lyrics (నేడే ..తెలిసింది)

చిత్రం: ఆరాధన (1976 )

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: మహమ్మద్ రఫీ , ఎస్. జానకి

సంగీతం: సాలూరి హనుమంత రావు



పల్లవి: నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే...ఏ... కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ... తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది చరణం 1: ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని అది వలచే దొకసారే ననీ ...ఆ వలపే విడిపో లేనిదనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది... చరణం 2: ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ... ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ... మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేననీ శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేననీ అది జతగా నను చేరాలని ..నా బ్రతుకే శృతి చేయాలని నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ... తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది... నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..

31, జులై 2021, శనివారం

Aaradhana : Na Madi Ninnu Pilichindi Ganamai Song Lyrics (ఓ ప్రియతమా ప్రియతమా..)

చిత్రం: ఆరాధన (1976 )

రచన: సి. నారాయణ రెడ్డి

గానం: మహమ్మద్ రఫీ

సంగీతం: సాలూరి హనుమంత రావు


పల్లవి:

ఓ ప్రియతమా ప్రియతమా.. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై

చరణం 1:

ఎవ్వరివో నీవు నేనెరుకలేను ఏ పేరున నిన్ను నే పిలవగల నూ ఎవ్వరివో నీవు నేనెరుకలేను ఏ పేరున నిన్ను నే పిలవగల నూ తలపులలోనే నిలిచేవు నీవే తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరుపుల రూపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై

చరణం 2:

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధా ఎందాకా దాచేను వేచిన మదినే వెలిగింప రావే వేచిన మదినే వెలిగింప రావే ఆరని అనురాగ దీపమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై