చిత్రం: బంగారు బొమ్మలు (1977)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: కె.వి. మహదేవన్
🕺నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
💃మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
💃నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
🕺మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
🕺💃నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
చరణం 1:
💃కనకదుర్గ కనుసన్నలలో..
గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో..
గలగల పారే తన ఒడిలో..
🕺మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ...
💃కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
🕺నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
చరణం 2:
🕺నీ కురుల నలుపులో...
నీ కనుల మెరుపులో...
అలలై... కలలై...
అలలై కలలై తానే వెలిసింది
💃నీ లేత మనసులో...
నీ దోర వయసులో...
వరదై... వలపై...
వరదై వలపై తానే ఉరికిందీ
🕺చిరుగాలుల తుంపరగా...
💃చిరునవ్వుల సంపదగా
🕺చిరుగాలుల తుంపరగా...
💃చిరునవ్వుల సంపదగా
🕺💃మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
💃నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
చరణం 3:
💃పంట పొలాల్లో పచ్చదనంగా
🕺పైరగాలిలో చల్లదనంగా
💃పంట పొలాల్లో పచ్చదనంగా
🕺పైరగాలిలో చల్లదనంగా
💃పల్లెపదంలో తీయదనంగా
💃🕺చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ...
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
🕺నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
💃మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...
🕺💃నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...