31, జనవరి 2022, సోమవారం

Bangaru Bommalu : Nenee Darini Song Lyrics (నేనీదరిని నువ్వా దరినీ)

చిత్రం: బంగారు బొమ్మలు (1977)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: కె.వి. మహదేవన్

🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 🕺మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 🕺💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... చరణం 1: 💃కనకదుర్గ కనుసన్నలలో.. గలగల పారే తన ఒడిలో కనకదుర్గ కనుసన్నలలో.. గలగల పారే తన ఒడిలో.. 🕺మన పడవలు రెండూ పయనించాలని బ్రతుకులు నిండుగ పండించాలని కలిపింది ఇద్దరినీ... 💃కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... చరణం 2: 🕺నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో... అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది 💃నీ లేత మనసులో... నీ దోర వయసులో... వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ 🕺చిరుగాలుల తుంపరగా... 💃చిరునవ్వుల సంపదగా 🕺చిరుగాలుల తుంపరగా... 💃చిరునవ్వుల సంపదగా 🕺💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... చరణం 3: 💃పంట పొలాల్లో పచ్చదనంగా 🕺పైరగాలిలో చల్లదనంగా 💃పంట పొలాల్లో పచ్చదనంగా 🕺పైరగాలిలో చల్లదనంగా 💃పల్లెపదంలో తీయదనంగా 💃🕺చిరంజీవులై జీవించాలని కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 🕺💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి