Bhale Thammudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhale Thammudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మార్చి 2024, ఆదివారం

Bhale thammudu : Nede Eenade Song Lyrics (నేడే ఈనాడే కరుణించే )

చిత్రం : భలే తమ్ముడు (1969)

గానం: పి. సుశీల, మహమ్మద్ రఫీ

రచయిత : సి.నారాయణ రెడ్డి

సంగీతం : టి. వి. రాజు


పల్లవి  :

నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే అ అ అ అ అ అ

చరణం 1 :

కనులముందున్న రతనాలమూర్తిని విలువలేరుగక విసిరితిని కనులముందున్న రతనాలమూర్తిని విలువలేరుగక విసిరితిని కనులు తెరచి,విలువ తెలిసి కనులు తెరచి,విలువ తెలిసి మనసే గుడిగా మలచితిని నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే

చరణం 2 :

మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసేదనూ మదిలో విరిసే మమతల మాలలు చెలిమికి కానుక చేసేదనూ అరని వలపుల,హారతి వెలుగుల అరని వలపుల,హారతి వెలుగుల కలకాలం నిను కొలిచెదనూ నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే.. అ అ అ అ అ అ

చరణం 3 :

చిలిపిగా కసిరే,చిలిపిగా కసిరే చెలియది సురులో అలకలుగని నవ్వుకున్ననూ చేతులు సాచిచెంతకు చేరిన చేతులు సాచి చెంతకు చేరిన అచెలినే అందుకొన్నాను నాచెలినే అందుకొన్నాను నేడే ఈనాడే మురిపించే నన్ను చెలితానే నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే నేడే ఈనాడే మురిపించే నన్ను చెలితానే అ అ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓహో ఓహో ఓహో ఓహో .


15, జనవరి 2022, శనివారం

Bhale Thammudu : Enthavaru Gani Vedanthulaina song Lyrics (ఎంతవారు గానీ)

 

చిత్రం :  భలే తమ్ముడు (1969) సంగీతం :  టి. వి. రాజు గీతరచయిత :  సి.నారాయణ రెడ్డి నేపధ్య గానం :  మహమ్మద్ రఫీ 


ఎంతవారు గానీ వేదాంతులైన గానీ వాలు చూపు సోకగానె తేలిపోదురొయ్ కైపులో. కైపులో. కైపులో. ఎంతవారు గానీ వేదాంతులైన గానీ వాలు చూపు సోకగానె తేలిపోదురొయ్ కైపులో. కైపులో. కైపులో.. హోయ్ హోయ్ చిన్నదీ మేనిలో మెరుపున్నదీ హాహా చేపలా తళుక్కన్నదీ హోయ్ సైపలేకున్నదీ.. హొయ్ హొయ్ చిన్నదీ మేనిలో మెరుపున్నదీ చేపలా తళుక్కన్నదీ సైపలేకున్నది.. ఏ వన్నే కాని వలపు నమ్మి వలను చిక్కునో కైపులో. కైపులో. కైపులో. ఆడకు వయస్సుతో చెరలాడకు హాహా ఆడితే వెనుకాడకు హుహు కూడి విడిపోకూ ఊ..ఊ ఆడకు...వయస్సుతో చెరలాడకు ఆడితే వెనుకాడకు కూడి విడిపోకూ.. హోయ్ మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో కైపులో. కైపులో. కైపులో. ఎంతవారు గానీ వేదాంతులైన గానీ వాలు చూపు సోకగానె తేలిపోదురొయ్.. కైపులో. కైపులో. కైపులో.

Bhale Thammudu : Gopala Bala Ninne Kori Song Lyrics (గోపాల బాల నిన్నే కోరి)

 

చిత్రం :  భలే తమ్ముడు (1969) సంగీతం :  టి. వి. రాజు గీతరచయిత :  సి.నారాయణ రెడ్డి నేపధ్య గానం :  మహమ్మద్ రఫీ 

పల్లవి  : గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ..హూ..హూ..హూ.. గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను...  చరణం 1 :  నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ.... హే..గీతా..ఆ..ఆ..ఆ నాథా..ఆ..ఆ.. నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ గారాల బాలా మారాము చేయొద్దు.. బైరాగిని అనుకోవద్దు..నేను.. ఆ నేనే.. ఈ నేనూ గొపాల బాల నిన్నే కోరి...  నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ... ఊ...  చరణం 2 : ఏ మూఢులు కాదంటున్నా... నా మనసే నీదేనన్న.. పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ.. కృష్ణమ్మా..ఆ...ఆ..ఆ..ఆ ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న.. పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో.. మరి గట్టు మీద చేరుస్తావో..అంతా నీ భారమన్నాను..ఊ..ఊ గోపాల బాల నిన్నే కోరి...  నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ...   చరణం 3 :  సిరులంటే ఆశ లేదు...  వరమేమి అక్కరలేదు గీతా పారాయణమే...  నా జీవిత లక్ష్యం అన్నాను.. సిరులంటే ఆశ లేదు...  వరమేమి అక్కరలేదు గీతా పారాయణమే...  నా జీవిత లక్ష్యం అన్నాను.. నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక.. నీలో నన్నే చేర్చేదాక... నీడల్లే నిన్నంటే వుంటాను గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను...ఊ..ఊ... గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి..ఈ..ఈ నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ... నీ చుట్టే తిరుగుతు వుంటాన... నీ చుట్టే తిరుగుతు వుంటానూ.. నీ చుట్టే..నీ చుట్టే తిరుగుతు వుంటానూ.. తిరుగుతు వుంటాను... తిరుగుతు వుంటాను..