చిత్రం : భలే తమ్ముడు (1969) సంగీతం : టి. వి. రాజు గీతరచయిత : సి.నారాయణ రెడ్డి నేపధ్య గానం : మహమ్మద్ రఫీ
పల్లవి : గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ..హూ..హూ..హూ.. గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను... చరణం 1 : నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ.... హే..గీతా..ఆ..ఆ..ఆ నాథా..ఆ..ఆ.. నీ నామం వింటూ వుంటే.. నిలువెల్ల పులికించేను నీ రూపం కంటూ వుంటే.. నన్ను నేనే మరిచేనూ గారాల బాలా మారాము చేయొద్దు.. బైరాగిని అనుకోవద్దు..నేను.. ఆ నేనే.. ఈ నేనూ గొపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ... ఊ... చరణం 2 : ఏ మూఢులు కాదంటున్నా... నా మనసే నీదేనన్న.. పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ.. కృష్ణమ్మా..ఆ...ఆ..ఆ..ఆ ఏ మూఢులు కాదంటున్నా.. నా మనసే నీదేనన్న.. పూజారి అడ్డం వున్నా... నా దైవం నీవేనమ్మ నిన్ను నమ్మిన వాన్ని నట్టేటా ముంచేస్తావో.. మరి గట్టు మీద చేరుస్తావో..అంతా నీ భారమన్నాను..ఊ..ఊ గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను... ఊ..ఊ... చరణం 3 : సిరులంటే ఆశ లేదు... వరమేమి అక్కరలేదు గీతా పారాయణమే... నా జీవిత లక్ష్యం అన్నాను.. సిరులంటే ఆశ లేదు... వరమేమి అక్కరలేదు గీతా పారాయణమే... నా జీవిత లక్ష్యం అన్నాను.. నా ముద్దు మురిపాలన్నీ తీర్చేదాక.. నీలో నన్నే చేర్చేదాక... నీడల్లే నిన్నంటే వుంటాను గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి నీ చుట్టే తిరుగుతు ఉంటాను...ఊ..ఊ... గోపాల బాల నిన్నే కోరి... నీ సన్నిధి చేరి..ఈ..ఈ నీ చుట్టే తిరుగుతు ఉంటాను..ఊ..ఊ... నీ చుట్టే తిరుగుతు వుంటాన... నీ చుట్టే తిరుగుతు వుంటానూ.. నీ చుట్టే..నీ చుట్టే తిరుగుతు వుంటానూ.. తిరుగుతు వుంటాను... తిరుగుతు వుంటాను..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి