Bommarillu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bommarillu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2024, ఆదివారం

Bommarillu : Laloo Darwaja Song Lyrics (లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: కుల శేఖర్

గానం: మురళి, నవీన్, ప్రియా ప్రకాష్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

హోయ్.. లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైన ఈ ప్రేమ గాద లొకటే ఊరువాడా లేవైనా గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా అయితే ఇప్పుడు ఏమిటంటారురా లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్.. లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

చరణం: 1 

కన్ననాడు అడిగామా పెంచటానికడిగామా గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినామా మెమూ కాదు అన్నా మా వేలు ఎత్తి చూపామ కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ అందుకే ...లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

చరణం: 2 

వేణుగాన లోల వేగముగా రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే వెన్నదొంగ రారా ఆలసించవేల పలికెను నోరారా నీ నామమే పొన్న చెట్టు నీడలోన కన్నె రాధా వేచి వుంది కన్నె రాధా గుండెలోన చిన్ని ఆశ దాగివుంది చిన్ని ఆశ దాగివుంది అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

19, డిసెంబర్ 2024, గురువారం

Bommarillu : Apudo Ipudo Song Lyrics (ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: కుల శేఖర్, అనంత శ్రీరామ్

గానం: సిద్ధార్థ్, జెనీలియా

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ ఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి

చరణం: 1

తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి

చరణం: 2

నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో సూటిగా ఈ మాటాలేవీ చెప్పక పోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంట ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాటాడావన్టె నాతోనే నేనుంట నీతో డే నాకుంటే యెదెదూ అయిపోత నీ జత లేకుంటే

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి అకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీ ఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని

Bommarillu : Bommanu Geesthey Song Lyrics (బొమ్మని గీస్తే నీలా ఉందీ)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: భాస్కర భట్ల

గానం: జీన్స్ శ్రీనివాస్, గోపిక పూర్ణిమ

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

బొమ్మని గీస్తే నీలా ఉందీ దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లెపాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముందీ ఇవ్వాలనీ నాకూ ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది

చరణం: 1

చలిగాలి అంది చెలికి వణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది చలినె తరిమేసే ఆ కిటుకే తెలుసండి శ్రమపడిపోయేకండీ తమ సాయం వద్దండీ పొమ్మంటావే బాలికా ఉంటానంటేఏ తోడుగా హబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద ఎం చెయ్యాలమ్మా నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది.

చరణం: 2

అందంగా ఉంది తనవెంటే పది మంది పడకుండా చూడు అని నా మానసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండీ అది నా నీడేనండీ నీతో నడిచి దానికీ అలుపొస్తుందే జానకీ హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగ్గ ఈ మాటకోసం ఇన్నాళ్లుగా వేచివుంది నా మనసు ఎన్నో కలలే కంటుంది బొమ్మని గీస్తే నీలా ఉందీ దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లెపాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది

Bommarillu : Kaani Ippudu Song Lyrics (కన్నులు తెరిచే కలగంటాం)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: భాస్కర భట్ల

గానం: దేవి శ్రీ ప్రసాద్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్




పల్లవి :

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్... పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్... ప్రేమ కోసం ఏకంగ తాజ్ మహాలే కట్టాడు షాజహాన్ కి పనిలేదా అని అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను ఓ ఓ ఓ అరే ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ హే పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్

చరణం: 1

ఓ ప్రేయసి ఊహల్లో లైఫ్ అంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను మాటి మాటికీ తడబడుతుంటే రారిరిదింకా దిగలేదనుకున్నాను ఓ ఓ ఓ అది ప్రేమని ఈరోజే తెలిసిందిరో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడా తడిసానురో కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్

చరణం: 1

ఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనే లేదు కాని ఇప్పుడు మ్మ్ నీ కోసం పుట్టీ నీ కోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కాని ఇప్పుడు మ్మ్ ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడ్నే ఎందుకు మిస్సైయ్యాను ఓ ఓ ఓ ఈ రోజులా ఏ రోజు అవలేదురో ఓ ఓ ఓ ఈ ప్రేమలో నే కూడ తడిసానురో కన్నులు తెరిచే కలగంటాం అని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్ హే పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే హయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు మ్మ్

14, నవంబర్ 2021, ఆదివారం

Bommarillu : Namma Tappani Song Lyrics (నమ్మక తప్పని)

చిత్రం: బొమ్మరిల్లు (2006)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: సాగర్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్


పల్లవి :

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న  ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ  ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న  నీ రూపం నా చూపులనోదీలేనా ఓ ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ

చరణం: 1

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా నా వెనువెంట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ

చరణం: 2

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న నీ రూపం నా చూపులనోదీలేనా ఓ