చిత్రం: చెన్నకేశవ రెడ్డి (2002)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సుజాత మోహన్
సంగీతం: మణిశర్మ
పల్లవి :
ఎం పిల్ల కుశలమ .. పరువాలన్ని పదిలమ ? కావాలా ప్రియతమ .. పెదవందించే మధురిమ.. పందిరై అల్లనా పెళ్లీడు ఆరాటమ ..
సొంతమై అందనా పెళ్ళాడు పురుషోత్తమ.. తెరచాటు విడి ఒడి చేరుకోమరి ..ఓ ఓ ఓ ఓ .. ఎం పిల్ల కుశలమ .. పరువాలన్ని పదిలమ ? కావాలా ప్రియతమ .. పెదవందించే మధురిమ.. నడిచే మేలిమి బంగారం ఇకపై నీజంట .. అల్లారు ముద్దుగా పెంచాం..
అల్లరి పిల్లను మాఇంట అల్లరి చేసే గారాబం చెల్లదే అత్తింట
అనిగిమనిగి ఉండను అంటే ..
మాకు ఒళ్ళు మంట
చరణం : 1 దొరకనుంది గా రకరకాలుగ , సుఖపడే యోగం ..
జరగనుంది గ శతవిధాలుగా జతపడే యాగం నిలవనందిగ చెలిమి అందకా బరువయే దేహం ..
కరుగుతుంది గ మిగలనంతగా సిగ్గు సందేహం కొనగోట మీటి నీ నడుముని తహ తహల పాటపలికించని ..
అలవాటు చేసి తొలి హాయిని కునుకన్న మాట వేలివేయని మొగమాట మెరుగని మోజురాని ఆ హ హ హ హ ఎం పిల్ల కుశలమ .. పరువాలన్ని పదిలమ ? కావాలా ప్రియతమ .. పెదవందించే మధురిమ..
చరణం : 2 పడుచు వాడిలో పదును చూడని అంది నా అందం ..
దురుసు దాడిలో సొగసు ఓడని అదో ఆనందం వగల వాడలో తడుములాడని కళ్ళలో మైకం ..
వయసు వేడితో వెతికి చూడని కోరికల లోకం నా కులుకులతో కలహించని ని కోరమీసాలా పౌరుషం ..
నీ వొంపులలో వెలిగించని నా ఎర్రని చూపుల పరవశం చెలరేగు తపనల పోరుకాని .. ఓ హో హో హో హో ఎం పిల్ల కుశలమ .. పరువాలన్ని పదిలమ ? కావాలా ప్రియతమ .. పెదవందించే మధురిమ.. పందిరై అల్లనా పెళ్లీడు ఆరాటమా .. సొంతమై అందనా పెళ్ళాడు పురుషోత్తమ.. తెరచాటు విడి ఒడి చేరుకోమరి ..ఓ ఓ ఓ ఓ ..